Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరిక‌ట్టాలి

చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరిక‌ట్టాలి

0

చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరిక‌ట్టాలి

న్యూస్ తెలుగు/ సాలూరు : చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టి బాల్య వివాహాలు నిర్మూలించాలని ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు .గురువారం అమరావతి సెక్రటేరియట్లో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సమీక్ష సమావేశంలో 26 జిల్లాల ICDS PD లు, RJD లతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ
రాష్ట్రంలో చిన్న పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలని అన్నారు అంగన్వాడీల్లో పౌష్టికాహారం అందించాలి చెప్పారు.రాష్ట్రంలో ఉన్న అన్ని అంగనవాడీ సెంటర్లకు త్రాగునీరు మరియు మరుగుదొడ్లు నిమిత్తం 52 కోట్లు మంజూరు చేసామని అన్నారు.బాల్య వివాహాలు ఆపాలి.. బాలకార్మికులు మరియు రోడ్డు మీద బిక్షాటన అరికట్టి వారిని భద్రతగా చైల్డ్ హోమ్ లో పెట్టి చదివించి వారిని క్షేమంగా చూసుకోవాలి. అన్నారు
రాష్ట్రంలో ఉన్న 55వేల అంగన్వాడీల్లో హెల్ప్ లైన్ నెంబర్ మరియు పోలీస్ నెంబర్ తప్పక ఏర్పాటు చెయ్యాలని చెప్పారు. (Story : చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరిక‌ట్టాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version