తుఫాను వల్ల నష్టపోయిన పంటల వివరాలు ప్రభుత్వానికి అందజేస్తాం
తాసిల్దార్ నటరాజ్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) ; ధర్మవరం మండల పరిధిలోని, పట్టణంలోని ఈనెల 23వ తేదీన కురిసిన అధిక వర్షానికి మండల పరిధిలోని పలు గ్రామాలను తీవ్ర నష్టాన్ని చవిచూశాయి, వాటిపై నష్ట పరిహారం కొరకు నివేదికలను తయారుచేసి ప్రభుత్వానికి పంపడం జరిగిందని తాసిల్దార్ నటరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని దర్శనమలలో నారాయణ నాయక్ శాంతమ్మల ఐదు ఎకరాల ద్రాక్ష తోట పూర్తిగా నష్టపోయారని, దాదాపు 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. అదేవిధంగా మల్లా కాలువలో ఒక ఎకరా మొక్కజొన్న పంటలో భయపరెడ్డి 30 వేల రూపాయలు నష్టపోయారని, రేగాటి పల్లి గ్రామంలో 10 ఎకరాల వేరుశనగ పంటలో రెండు లక్షల వరకు రాజశేఖర్ అనే రైతు నష్టపోయారని తెలిపారు. అదేవిధంగా గోట్లురు గ్రామంలో కమతం గంగన్న రెండు ఎకరాల వరి పంటను పూర్తిగా నష్టపోయారని తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని పలు వార్డులలో హ్యాండ్లూమ్ అధికారి శ్రీనివాస్ నాయక్ తో పాటు తాను కూడా చేనేత కార్మికుల ఇళ్లల్లో మగ్గాలలో నీరు చేరిన వాటిని కూడా పరిశీలించడం జరిగిందని తెలిపారు. తదుపరి నష్టపరిహారంలో భాగంగా నివేదికలను తయారుచేసి ప్రభుత్వానికి పంపడం జరిగిందని, ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం వచ్చిన వెంటనే అందరికీ పంపిణీ చేస్తామని వారు తెలిపారు.(Story : తుఫాను వల్ల నష్టపోయిన పంటల వివరాలు ప్రభుత్వానికి అందజేస్తాం)