పన్నుల సేకరణ పై అధికారులు సిబ్బంది సమన్వయంతో పని చేయాలి
మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణములోని పన్నుల సేకరణ పై అధికారులు, సిబ్బంది సమన్వయంగా పనిచేసినప్పుడే పురపాలక సంఘం అభివృద్ధి బాటలో ఉంటుంది అని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో పన్ను సేకరణ పురోగతిపై సమీక్ష సమావేశాన్ని వారు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత సమావేశ నివేదిక ఆధారంగా ఆస్తి అంచనాల పెరుగుదల, పన్ను సేకరణలో మెరుగుదల, డిమాండ్ పెరుగుదలపై ఈ సమావేశమును నిర్వహించడం జరిగిందని తెలిపారు. కొత్త పన్నులు విధించడంలో మెరుగుపరచాలని, తక్కువ అంచనా వేసిన ఆస్తుల పన్నులను సరిచేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. షాపు గదుల అద్దె సేకరణ పై రెవెన్యూ ఆఫీసర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ తో కూడా సమీక్షను నిర్వహించడం జరిగిందని తెలిపారు. నీటి చార్జీల సేకరణకు మెరుగుపరచడానికి కార్యదర్శలతో కలిసి పనిచేయాలని పరిపాలన కార్యదర్శులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న పన్ను బకాయి దారులకు త్వరితగతింగా నోటీసులు పంపి వారి బాకీని చెల్లించాలని ఆదేశాలను జారీ చేయడం జరిగిందని తెలిపారు. పన్ను వసూలు కార్యక్రమంలో సిబ్బంది గాని, అధికారులు గానీ నిర్లక్ష్యం వహిస్తే,కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ ఆఫీసర్లు, అమినీటి కార్యదర్సులు, పరిపాలన కార్యదర్శులు, సంబంధిత సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. (Story : పన్నుల సేకరణ పై అధికారులు సిబ్బంది సమన్వయంతో పని చేయాలి)