వనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా మద్దెల కృష్ణ
న్యూస్‌తెలుగు/ వనపర్తి : వనపర్తి సీఐగా మద్దెల కృష్ణ మంగళవారం బాధ్యతలు చేపట్టారు.ఇక్కడ పనిచేస్తున్న నాగభూషణం రావు హైదరాబాదుకు బదిలీ కావడంతో కృష్ణను నియమించారు. బాధ్యతలు చేపట్టిన నూతన సీఐ మద్దెల కృష్ణ, వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.ఎస్పీ మాట్లాడుతూ విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని సూచించారు. (Story : వనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా మద్దెల కృష్ణ)