Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పశువులకు ఆరోగ్య ధృవీకరణ పత్రాల జారీ

పశువులకు ఆరోగ్య ధృవీకరణ పత్రాల జారీ

0

పశువులకు ఆరోగ్య ధృవీకరణ పత్రాల జారీ

న్యూస్‌తెలుగు/ వినుకొండ : వినుకొండ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పట్టి ఉంచిన గోవులను తనిఖీ చేసి వైద్యం అందించాలని ఎమ్మెల్యే జి వి ఆంజనేయులు సూచన మేరకు మున్సిపాలిటీ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పశుసంవర్ధక శాఖ అధికారులను పిలిపించి ఆవుల యొక్క ఆరోగ్య పరిస్థితిని పరిశీలింప చేసి పశువుల ఆరోగ్యం మరియు శ్రేయస్సును నిర్ధారించుకున్నారు. పశుసంవర్ధక వైద్యులు ఆవులను పరిశీలించి పశువులకు ఆరోగ్య ధృవీకరణ పత్రాలను జారీ చేసారని తెలిపారు. ఆవుల యొక్క ఆహారం మరియు ఆశ్రయం నిర్వహణపై వైద్యులు సలహాలు సూచనలు ఇచ్చారని తెలిపారు. అంటు వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని అనారోగ్యంతో ఉన్న పశువులకు త్వరితగతిన వైద్య చికిత్స అందించాలని, ముందు జాగ్రత్త చర్యగా జబ్బుపడిన జంతువులను వేరుచేయాలని, క్రమం తప్పకుండా పశువులు ఉన్న ప్రాంతాన్ని శుభ్రపరచడం మరియు క్రిమిసంహారము చేయడం, పశువుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ చెయ్యాలని వైద్యులు తెలిపారు. (Story : పశువులకు ఆరోగ్య ధృవీకరణ పత్రాల జారీ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version