బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
న్యూస్‌తెలుగు/పెబ్బేరు : బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పెబ్బేరు మండల విద్యా ది కారి జయ రాములు అన్నారు. మంగళవారం పెబ్బేరు అంగన్వాడీ ఆరవ కేంద్రం లో గ్రామ స్థాయి బాలల పరి రక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జయ రాములు మాట్లాడుతూ బాల్య వివాహా నిషేధ చట్టం ప్రకారము అమ్మాయి కి 18 అబ్బాయి కి21 సంవత్సరాలు నిండిన తరువాత వివాహం చేయాలని చెప్పారు. బాల్య వివాహాల కారణంగా అమ్మాయిలు తమ జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిరోహించడంలో ఆటంకం ఏర్పడుతుందని అన్నారు. చిన్న వయసులో వివాహం చేసుకోవడం కారణంగా శరీరక వృద్ధి కోల్పోతారని, ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. కాబట్టి బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ సుదర్శన్ టీచర్లు పావని సుమతి అంగన్వాడీ కార్యకర్త భారతమ్మ గ్రామ సమాఖ్య ఆర్ అలివేల మ్మ తల్లులు పాల్గొన్నారు. (Story : బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలి)