శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో పోటెత్తిన భక్తులు
న్యూస్ తెలుగు/విజయనగరం : ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా మంగళవారం పట్టణంలోని చదురు, వనం దేవాలయాల వద్ద భక్తులు ఉదయం నుండే బారులు తీరారు. గతవారం జరిగిన సిరిమాను ఉత్సవం లో అమ్మవారిని దర్శించుకోలేని భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారికి పసుపు, కుంకుమలు, పూలు పండ్లు, గాజులుసమర్పించుకున్నారు.దేవస్థానం భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేసింది. దేవాలయం వద్దకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈవో డివివి ప్రసాద రావు ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు.స్వచ్చందసేవకులు భక్తులకు మంచినీరు, మజ్జిగ అందజేశారు.ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న తరుణంలో ఆలయంలో అమ్మవారి కి అర్చకులు ఉదయం పంచామృత అభిషేకం, ప్రత్యేక పూలాలంకరణలుచేసారు. దేవాలయ ప్రాంగణంలో ఉచిత మెడికల్ క్యాంపు తో పాటు భక్తులకు ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలను దేవస్థానం అధికారులు నిర్వహించారు.(Story:శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో పోటెత్తిన భక్తులు )