ఫోన్ పోతే ఆందోళన వద్దు
*ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస్.
*ఎస్సై తాజుద్దీన్.
*- మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి.
* సెల్ ఫోన్ల రికవరీ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు.
* ఏటూరు నాగారం లో పోగొట్టుకున్న,చోరికి గురైన మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత.
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి మొబైల్ ఫోన్ల రికవరీ కోసం ,ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారని,గత సంవత్సరం పోర్టల్ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని,ఏటూరునాగారం సిఐ అనుముల శ్రీనివాస్, ఎస్ఐ తాజ్ద్దీన్ తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో సెల్ పోగొట్టుకున్న వారిని పిల్పించి మొబైల్ అందించామని పేర్కొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న, లేదా దొంగిలించబడిన వెంటనే సెయిర్ పోర్టల్ ( https://www.ceir.gov.in ) నందు బ్లాక్ చేసి, సంభందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని, సూచించారు.పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి సెయిర్ వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని సెయిర్ వెబ్సైట్లో వినియోగదారులు వివరాలను,నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సెయిర్ ఆవశ్యకతను తెలుపుతూ, ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఫోన్లలో ఉన్న వ్యక్తిగత ఆధారం గురించి,నష్టాన్ని కాజేస్తుందన్నారు. ఇది వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. అదే విదంగా ఎవరైనా సెకండ్ హాండ్ ఫోన్ లు కొనే ముందు అప్లికేషన్లో అట్టి ఫోన్ యొక్క వివరాలను అనగా ఇమెయి నంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలని, తద్వారా అట్టి ఫోన్ ఆ ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుంది అన్నారు. అదేవిధంగా ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే, సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, సెల్ బాధితుల పాల్గొన్నారు.(Story:*ఫోన్ పోతే ఆందోళన వద్దు)