బహుజనుల ఎజెండా బీసీ ముఖ్యమంత్రి లక్ష్యం
న్యూస్‌తెలుగు/వనపర్తి : బహుజనుల రాజ్యాధికార సాధన దిశగా ఫిబ్రవరిలో బి.ఎల్.ఎఫ్. ఆధ్వర్యంలో జరిగే లక్ష మంది బహుజన బహిరంగ సభను జయప్రదం చేయండి.” బి.ఎల్.ఎఫ్. చైర్మన్ నల్ల సూర్య ప్రకాష్ పిలుపునిచ్చారు. కొత్తపేటలోని వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నాయకత్వ సమావేశానికి వర్కర్స్ పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పు యాదయ్య అధ్యక్షతన జరిగింది . ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నల్ల సూర్యప్రకాష్ హాజరై ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కొన్నాళ్లు బి.ఆర్.ఎస్. ప్రభుత్వం తొమ్మిదేళ్లు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తోంది. గత పదేళ్లుగా దేశవ్యాప్తంగా బిజెపి ప్రభుత్వం యొక్క పాలన చూసిన దళిత, బహుజన ప్రజలు బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాల పరిపాలనపై తెలంగాణ రాష్ట్రంలో విశ్వాసం కోల్పోయి ఉన్నారని, దళిత బహుజనులకు సామాజిక అణిచివేత ఆర్థిక, రాజకీయ రూపాలలో జరుగుతూనే, మరొకవైపు అత్యల్పంగా ఉన్న అగ్రవర్ణాలు అత్యధికంగా ఉన్న బహుజన వర్గాలను పరిపాలిస్తున్నవని, శ్రీలంక దేశంలో నూతన వామపక్ష ప్రభుత్వ స్ఫూర్తితో, తెలంగాణ రాష్ట్రంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ను అధికారంలోకి తీసుకువచ్చే క్రమంలో, 2025 ఫిబ్రవరిలో లక్ష మంది బహుజన ప్రజలచే భారీ బహిరంగ సభ నిర్వహించి బి.ఎల్.ఎఫ్. శక్తి ప్రదర్శన చేయనున్నామని దీనికి బి.ఎల్.ఎఫ్. భాగస్వామ్య రాజకీయ పార్టీలైన వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా,(WPI) ప్రజా పోరాట సమితి (PRPS) ఎం సి పి ఐ (యు), బహుజన కమ్యూనిస్టు పార్టీ (బి ఎల్ పి) , సిపిఐ ఎంఎల్ (రెడ్ స్టార్) సిపిఐ ఎంఎల్ (రెడ్ ఫ్లాగ్) 7 రాజకీయ పార్టీలు గురుతర బాధ్యతను నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాండురంగ చారి హాజరై ప్రసంగిస్తూ ఈ దేశంలో స్వాతంత్ర పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం జరిగాయని ఇక జరగవలసింది బహుజనుల రాజ్యాధికార పోరాటమేనని దీనికి పరిష్కారం బీసీ ముఖ్యమంత్రి అంతిమ లక్ష్యమని పాండురంగ చారిసమాజంలో పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన ఎన్నికల ముందు చెప్పిన కామారెడ్డి డిక్లేరేషన్ స్థానిక ఎన్నికల ముందే అమలు చేసి బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని లేని పక్షంలో ఎన్నికలలో మా తడాఖా చూపిస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నెలలో జరిగే లక్ష మంది బహిరంగ సభకు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇంటికో మనిషి ఊరుకో బండి రావాలని సమావేశంలోకోరారు. ఈ సమావేశంలో బి ఎల్ పి రాష్ట్ర కోశాధికారి మా రోజుసునీల్ కుమార్ వర్కర్స్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగయ్య ముదిరాజ్, వర్కర్స్ పార్టీ హైదరాబాద్ ఇన్చార్జి పండరీనాథ్ నేత, వర్కర్స్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వి రాములు, వర్కర్స్ పార్టీ వనపర్తి జిల్లా ఇన్చార్జి బండారి వెంకటస్వామి గౌడ్,విశ్వకర్మ పంచ వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డుపల్లి కోటేశ్వర చారి, మహిళా సమాఖ్య నాయకురాలు వడ్ల అరుణ, వర్కర్స్ పార్టీ రాష్ట్ర నాయకులు రవికుమార్, వర్కర్స్ పార్టీ నాయకులు రాజేశ్వరరావు,ధర్మాచారి,ఉమాదేవి,సంధ్య,తిప్పర్తి వెంకటాచారి,వెంకటేశం, స్వామి చారి, సిహెచ్ నరసింహ చారి, తదితరులు పాల్గొన్నారు .