ఉచిత రక్తనాళాల వైద్య శిబిరంకు విశేష స్పందన
శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ నామా ప్రసాద్
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణంలోని మాధవ నగర్ లో సత్యసాయి భజన మందిరంలో నిర్వహించిన ఉచిత రక్త నాళాల వైద్య శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశపు అతిపెద్ద ఏసియన్ వాసూక్లర్ హాస్పిటల్, హైదరాబాద్ వైద్యులచే పేద ప్రజలకు అన్ని రకాల ఉచిత వైద్య పరీక్షలు, ఉచిత వైద్య చికిత్సలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. హైదరాబాద్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సురేంద్ర, డాక్టర్ అనిల్, డాక్టర్ సాయి తేజలచే 175 మందికి వైద్య పరీక్షలను నిర్వహించడం జరిగిందని, ఇందులో 70 మందికి హైదరాబాద్ హాస్పిటల్ లో ఉచితంగా ఆపరేషన్లు కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 5000 రూపాయలు విలువైన రక్తనాళాల సర్జన్ కన్సల్టేషన్ వైద్య పరీక్షలను కూడా నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ శిబిరంలో ఉబ్బిన మేలు తిరిగిన నరాలకు, స్పైడర్ చీరలు, కాలులో రక్తం సరఫరా లేకపోవడం, సారీయాసిస్, మెదడుకు తగినంత రక్త సరఫరా లేకపోవడం లాంటి సమస్యలకు మంచి వైద్య చికిత్సలను కూడా అందించి, ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి సేవ సమితి సభ్యులు పరంధామయ్య చంద్ర సురేష్ బాబు పద్మావతి, హైదరాబాద్ ఆసుపత్రి మేనేజర్ సురేంద్ర, 12 మంది సేవాదళ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.(Story:ఉచిత రక్తనాళాల వైద్య శిబిరంకు విశేష స్పందన)