రీ సర్వేను పగడ్బందీగా నిర్వహిస్తాం.. తాసిల్దార్ నటరాజ్
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : మండల పరిధిలోని అన్ని గ్రామాలలో రీ సర్వేను ప్రభుత్వ ఆదేశాల మేరకు చట్టపరంగా నియమ నిబంధనల ప్రకారం పూర్తి చేస్తామని తాసిల్దార్ నటరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని తుమ్మలలో జరుగుతున్న రీ సర్వే గ్రామసభను ఆకస్మికంగా వారు తనిఖీ చేశారు. అనంతరం రైతుల వద్ద రీ సర్వే అభ్యంతరాల దరఖాస్తులు కూడా స్వీకరించారు. తదుపరి ఈ దరఖాస్తులపై త్వరలోనే విచారణ చేపట్టి రైతులందరికీ న్యాయం చేకూర్చేలా కృషి చేస్తానని వారు తెలిపారు. తదుపరి ఈనెల 21వ తేదీన రావులచెరువు, 22వ తేదీన గోట్లురు, 23వ తేదీన దర్శనమలలో రీ సర్వేపై గ్రామసభలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కావున ఆయా గ్రామ ప్రజలు రైతులు ఈ గ్రామ సభకు తరలిరావాలని తెలిపారు. గ్రామ సమస్యలు కూడా తెలుపుకొనే అవకాశం ఈ సభలో ఉందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రీ సర్వే డిప్యూటీ తాసిల్దార్ రమణబాబు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ అంజలీదేవి, మండల సర్వేయర్ మంజులాదేవి, విఆర్వోలు లక్ష్మీనరసమ్మ, నారాయణస్వామి, విలేజ్ సర్వేర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.(Story:రీ సర్వేను పగడ్బందీగా నిర్వహిస్తాం.. తాసిల్దార్ నటరాజ్)