Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌నిత్యవసర వస్తువులు పక్కదారిపడిడే కఠిన చర్యలు

నిత్యవసర వస్తువులు పక్కదారిపడిడే కఠిన చర్యలు

నిత్యవసర వస్తువులు పక్కదారిపడిడే కఠిన చర్యలు

జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ నిధిమీనా

న్యూస్‌ తెలుగు/ విజయవాడ : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు పంపిణీచేసే నిత్యావసర వస్తువుల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా ఉపేక్షించేదిలేదని, అక్రమాలకు పాల్పడితే 6ఏ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ నిధిమీనా అధికారులను ఆదేశించారు. నిత్యవసర వస్తువులు పంపిణీ డీలర్లు నియామక ప్రక్రియపై కలెక్టర్‌ శనివారం రెవిన్యూ, పౌర సరసంబందాల శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్క కార్డు దారునికి నిత్యవసర వస్తువులు సకాలంలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో గత 3 నెలల్లో నిత్యావసర వస్తువుల పంపిణీలో అవకతకవకలకు పాల్పడినవారిపై 54 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రెవిన్యూ అధికారులు వారి పరిదిలో రేషన్‌ దుకాణాల్లో ప్రతివారం తనిఖీలు నిర్వహించి నేవేదిక ఇవ్వాలని ఆదేశించారు. కార్డుదారులు సౌకర్యార్ధం 800 కార్డులు పైబడిన రేషున్‌ దుకాణాన్ని రెండు దుకాణాలుగా విభజించి రేషన్‌ పంపిణీ చేయాలన్నారు. రెవిన్యూ అధికారులు వారి పరిదిలో ఏర్పాటు చేయనున్న కొత్త డీలర్లు నియామకానికి ఈ నెల 20న నోటిఫికేషన్‌ జారీ చేయాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు నబందర్‌ 5న రాతపరీక్ష నిర్వహించటం జరుగుతుందని, అనంతరం 7న మౌఖిక పరీక్షలు నిర్వహించి అర్హులైన వారిని డీలర్లుగా నియమించే ప్రక్రియ 12వ తేదీ నాటికి పూర్తి చేయాచాలని ఆదేశించారు.
రేషన్‌ దుకాణాల్లో బియ్యంతో పాటు 3కిలో జోన్నలు ఉచితంగా పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్డు దారులు వారి అభిరుచి మేరకు బియ్యానికి బదులు 3కిలోల వరకు జోన్నలు ఉచితంగా పొందవచ్చన్నారు. బహిరంగ మార్కెట్‌లో నిత్యవసర సరుకుల ధరలను నియంత్రించటంలో బాగంగా జిల్లాలోని అన్ని రైతు బజార్లులో వంట నూనెలు, కందిపప్పు, ఉల్లి పాయలు నిర్ధేశించిన ధరలకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ సమావేశంలో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ధ్యానచంద్ర, డీఆర్వో శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శుభమ్‌, పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ వెంకటేశ్వర్లు, డీఓఫ్‌వో పాపారావు, ఆర్డీవో చైతన్య పాల్గొన్నారు. (Story : నిత్యవసర వస్తువులు పక్కదారిపడిడే కఠిన చర్యలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!