Home వార్తలు తెలంగాణ వెంకటాపురం పోలీస్ స్టేషన్ ను తనిఖీ

వెంకటాపురం పోలీస్ స్టేషన్ ను తనిఖీ

0

వెంకటాపురం పోలీస్ స్టేషన్ ను తనిఖీ

జిల్లా ఎస్పీ శబరిష్

న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : రహదారులపై ఇసుక లారీలను నిలిపి వేస్తే కేసులు నమోదు చేయాలని, గంజాయి రవాణా, గుడుంబా తయారీని పూర్తి స్టాయిలో అడ్డుకట్ట వేయాలని, ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ పోలీస్ అధికారులను ఆదేశించారు.వార్షిక తనిఖీలో భాగంగా శుక్రవారం వెంకటాపురం పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు.ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మావోయిస్టుల కదలికలపై మరింతగా నిఘా పెంచాలని,ఫిర్యాదు దారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని,వారికీ కనీస సౌకర్యాలను కల్పించాలన్నారు. స్టేషన్ రిసెప్షన్ లో గల రికార్డ్స్ ను పరిశీలించి, కేసుల నమోదు వాటి యొక్క స్థితి గతులను తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క కిట్ ఆర్టికల్స్, ఆయుధ సామాగ్రిని ని సిబ్బంది యొక్క నైపుణ్యాన్ని తనిఖీ చేసారు. వెంకటాపురం పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చతిస్గడ్ తో, అంతర్రాష్ట్ర సరిహద్దును కలిగి ఉన్నందున, గంజాయి రవాణా పై ఎక్కువగా దృష్టి సారించాలని, ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉన్నందున, ప్రజల భద్రత కై చర్యలు తీసుకోవాలని తెలిపారు.అలాగే బాధిత వ్యక్తుల నుంచి, ఫిర్యాదును స్వీకరించిన అనంతరం, వారికి వెంటనే రసీదు అందించాలని, ఎఫ్ ఐ ఆర్ నమోదు, కేసుల దర్యాప్తు నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ పోలీస్ స్టేషన్ ఆవరనలో గల నమోదు కాబడని, లేదా వదిలివేయబడిన, వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ ఉద్యోగం అనేది భాద్యతతో కూడుకున్నదని, క్రమశిక్షనతో ఉద్యోగం చేయాలనీ, విధులలో నిర్లక్ష్యం వాయిస్తే, శాఖ పరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కార దిశగా ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలోవెంకటాపురం సిఐ బండారి కుమార్ వెంకటాపురం ఎస్సై తిరుపతి రావు, శిక్షణ (ప్రొబేషనరీ) ఎస్ఐ అంజినేయులు,పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. (Story : వెంకటాపురం పోలీస్ స్టేషన్ ను తనిఖీ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version