ఘనంగా జరిగిన మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన శాఖ గ్రంథాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి ఆధ్వర్యంలో పాఠకులు, సిబ్బంది నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. తదుపరి వాల్మీకి చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వాల్మీకి సంస్కృతి భాష యొక్క మొదట కవి అని, కోలారు నగరంలో వాల్మీకి జయంతి తొలి జీవితం వాల్మీకి ఒక హైవే డెకఈట్ అని నమ్ముతారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజం గొప్ప రుషికవి అని రామాయణాన్ని రచించిన మహర్షి అని, ఈరోజుకు కూడా మనం గొప్పగా చెప్పుకుంటున్నామని తెలిపారు. ఈరోజును ప్రగత్ దివాసుగా కూడా పాటించడం జరుగుతుందని తెలిపారు. వాల్మీకి అడుగుజాడల్లో అందరూ నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది శివమ్మ, సత్యనారాయణ, రమణ నాయక్ పాఠకులు పాల్గొన్నారు.(Story:ఘనంగా జరిగిన మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు)