శానిటరీ కార్మికుల సమస్యలను పరిష్కరించండి..
సిఐటియు మండల కన్వీనర్ జే వి రమణ, కో కన్వీనర్ అయూబ్ కాన్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ప్రభుత్వ పాఠశాలల్లో గల శానిటరీ వర్కర్స్ సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరుతూ ఎం ఈ ఓ లకు వినతి పత్రాన్ని సిఐటియు నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ జే వి రమణ, కో కన్వీనర్ అయూబ్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల యందు పనిచేస్తున్న శానిటరీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని తాము కోరడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగానే ఈనెల 21వ తేదీ నాడు స్థానిక ఎంఈఓ కార్యాలయం ముందు ఒకరోజు దీక్షలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. శానిటరీ వర్కర్స్ కు కనీస వేతనం అమలు చేయాలని, పి ఎస్ ఇ, ఈఎస్ఐ సౌకర్యం ఏర్పాటు, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తాము చేపట్టె పోయే దీక్షకు ఎంఈఓ ద్వారా అనుమతి కూడా కోరడం జరిగిందని తెలిపారు. కావున శానిటరీ వర్కర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని దీక్షను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శానిటరీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు లక్ష్మీదేవి, కార్యదర్శి నాగవేణి తదితరులు పాల్గొన్నారు.(Story : శానిటరీ కార్మికుల సమస్యలను పరిష్కరించండి..)