పోలీసుల ఆధ్వర్యంలో రాంనగర్ లో గ్రామ సభ
పరిష్కారం దిశగా పోలీసులు. సిఐ, ఎస్ఐ.
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : ఏటూరునాగారం మండలం కోయగూడ ఎల్లాపూర్ గ్రామంలో బుధవారం పోలీసుల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై తాజోద్దీన్ సమక్షంలో చేపట్టిన గ్రామసభలో పలువురు గ్రామస్తులు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని సిఐ శ్రీనివాస్, ఎస్ ఐ తాజ్ ద్దీన్ తెలిపారు.ఏటూరునాగారం, రామన్నగూడెం, రాంనగర్ మీదుగా బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరగా, స్పందించిన సీఐ, ఎస్సైలు డిపో మేనేజర్ తో మాట్లాడి, వారంలోగా బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీనిచ్చారు. అదే విధంగా గ్రామాల్లో విద్యుత్ స్తంబాలు, వైర్లు కిందికి ఉన్నాయని తెలుపగా ఏఈ అశోక్ తో మాట్లాడి చెట్లను కొట్టించారు. అంతేకాకుండా గ్రామంలో మురికి కాలువలు, పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. (Story : పోలీసుల ఆధ్వర్యంలో రాంనగర్ లో గ్రామ సభ)