UA-35385725-1 UA-35385725-1

మహాలక్ష్మి, గృహజ్యోతి కొరకు ప్రజాపాలన లో దరఖాస్తు చేసుకోండి

మహాలక్ష్మి, గృహజ్యోతి కొరకు ప్రజాపాలన లో దరఖాస్తు చేసుకోండి

న్యూస్ తెలుగు/వనపర్తి : మహాలక్ష్మి, గృహజ్యోతి కొరకు ప్రజాపాలన ద్వారా దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందని లబ్ధిదారులు ప్రజాపాలన కేంద్రంలో సంప్రదించాలని జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం మధ్యాహ్నం కలక్టర్ ఛాంబర్ లో పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పేద ప్రజలకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కొరకు గృహాజ్యోతి పథకాలకు ప్రజాపాలన ద్వారా దరఖాస్తు చేసుకొని ఇంకా మంజూరు కానివారు, లబ్ధి పొందని వారు తమ సమీప ప్రజాపాలన కేంద్రంలో తగు ఆధారాలతో సంప్రదించాలని కలక్టర్ సూచించారు. మహాలక్ష్మి కొరకు గ్యాస్ పాస్ పుస్తకం, గృహజ్యోతీ కొరకు విద్యుత్ బిల్లు తీసుకువెళ్ళి ప్రజాపాలన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. అన్ని మండల అభివృద్ధి కార్యాలయాల్లో, అన్ని మున్సిపల్ కార్యాలయాల్లో, కలక్టరేట్ లో సైతం ఒక ప్రజాపాలన కేంద్రం పనిచేస్తుందని తెలియజేశారు . ఇందుకు సంబంధించిన మార్గనిర్దేశాలను కలెక్టర్ పౌర సరఫరాల శాఖ అధికారులకు ఇచ్చారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ మహాలక్ష్మి, గృహాజ్యోతీ పథకం వర్తింపజేయాలని అధికారులను సూచించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్, సివిల్ సప్లై అధికారి కాశి విశ్వనాథ్, డి.యం. ఇర్ఫాన్, డి.టి లు పాల్గొన్నారు.(Story:మహాలక్ష్మి, గృహజ్యోతి కొరకు ప్రజాపాలన లో దరఖాస్తు చేసుకోండి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1