Home వార్తలు నవంబర్ 1న ‘ఉగ్రావతారం’

నవంబర్ 1న ‘ఉగ్రావతారం’

0

నవంబర్ 1న ‘ఉగ్రావతారం’

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా : ఎస్‌జీఎస్ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రియాంక ఉపేంద్ర సమర్పణలో ఎస్.జి. సతీష్ నిర్మాతగా గురుమూర్తి దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం ‘ఉగ్రావతారం’. ఈ చిత్రంలో ప్రియాంక ఉపేంద్ర లీడ్ రోల్‌లో నటించారు. సుమన్, నటరాజ్ పేరి, అజయ్, పవిత్రా లోకేష్, సాయి ధీనా, సుధి కాక్రోచ్, లక్ష్య శెట్టి వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్, ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు, నటుడు సత్య ప్రకాష్, నిర్మాత రాజ్ కందుకూరి సందడి చేశారు. కరాటే రాజు, సత్య ప్రకాష్ చేతుల మీదుగా పాటను విడుదల చేయించారు. అనంతరం రాజ్ కందుకూరి ట్రైలర్‌ను లాంచ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో..
 *రాజ్ కందుకూరి మాట్లాడుతూ..* ‘ఉగ్రావతారం వంటి కంటెంట్ దసరాకి రావాల్సిన సినిమా. ఫీమేల్ ఓరియెంటెడ్‌గా తీసిన ఈ చిత్రం దసరాకి వస్తే ఇంకా బాగుండేది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాటిని చూపిస్తూ తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. గురుమూర్తి ఇది వరకు తీసిన చిత్రాలు కూడా బాగుంటాయి. నవంబర్ 1న రాబోతోన్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. ప్రియాంక ఉపేంద్రకు మంచి సక్సెస్ రావాలి. ఇలాంటి చిత్రాలను మీడియా ముందుండి నడిపించాలి’ అని అన్నారు.
 *ప్రియాంక ఉపేంద్ర మాట్లాడుతూ..* ‘నాకు హైద్రాబాద్‌తో ఎంతో అనుబంధం ఉంది. ఉపేంద్ర గారిని ఫస్ట్ టైం ఇక్కడే కలిశాను. హైద్రాబాద్ నాకు చాలా లక్కీ సిటీ. నా కెరిర్‌లో ఇదే ఫస్ట్ యాక్షన్ ఫిల్మ్. గురుమూర్తి గారి వల్లే ఈ మూవీని చేశాను. నేను ఈ పాత్రకు సెట్ అవుతాను అని ఆయనే నమ్మారు. కెమెరామెన్ నందకుమార్ అందరినీ బాగా చూపించారు. నటరాజ్ అద్భుతంగా నటించాడు. రాజు గారు తెలుగులో మంచి పాటలు, మాటలు ఇచ్చారు. కృష్ణ బస్రూర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నవంబర్ 1న మా చిత్రం రాబోతోంది.నా మొదటి పాన్ ఇండియన్ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.
 *గురుమూర్తి మాట్లాడుతూ..* ‘సమాజంలో జరిగే అన్యాయాల్ని, అఘాయిత్యాల్ని మీడియా ప్రశ్నించి ఎదురించగలదు. మా ఈ చిత్రాన్ని అటువంటి సమస్యల మీదే తీశాను. మంచి సందేశాత్మాక చిత్రంగా ఉంటుంది. ప్రియాంక మేడం కొత్త పాత్రలో కనిపించబోతున్నారు. నటరాజ్ అద్భుతంగా నటించాడు. నవంబర్ 1న రానున్న మా చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.
 *నటుడు సత్య ప్రకాష్ మాట్లాడుతూ..* ‘కలకత్తా కాళి గురించి అందరికీ తెలిసిందే. మన ప్రియాంక గారు కలకత్తా బిడ్డ. కర్తవ్యంలో విజయశాంతి గారిని చూసి ఎలా అనుకున్నారో.. ఈ మూవీ తరువాత ప్రియాంక గారిని అలా అనుకుంటారు. ఈ మూవీ తరువాత ప్రతీ ఇంట్లోకి ప్రియాంక గారు వెళ్తారు. మనమంతా కలిసి ఆమెను సపోర్ట్ చేద్దాం. ఈ చిత్రంలో నా కొడుకు నటించాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. గురుమూర్తి చాలా డెడికేటెడ్ డైరెక్టర్. నవంబర్ 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
 *నటరాజ్ మాట్లాడుతూ..* ‘సతీష్ గారు నిర్మించిన ఈ చిత్రానికి ప్రియాంక ఉపేంద్ర గారు సమర్పకురాలు. గురుమూర్తి గారు ఈ మూవీని అద్భుతంగా రాసుకుని తెరకెక్కించారు. నంద కుమార్ మంచి విజువల్స్ ఇచ్చారు. కృష్ణ బస్రూర్ సంగీతం అదిరిపోతుంది. ఇది కంటెంట్ బేస్డ్ మూవీ. మహిళలకు జరిగే అన్యాయాలు, అఘాయిత్యాలను అమ్మవారు వచ్చి కాపాడితే ఎలా ఉంటుందనేది ఈ చిత్రంలో ఉంటుంది. ప్రియాంక గారు అద్భుతంగా నటించారు. మా చిత్రం నవంబర్ 1న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
 *కరాటే రాజు మాట్లాడుతూ..* ‘ప్రస్తుతం సినిమాకు భాష లేదు. కంటెంట్ బాగుంటే అన్ని భాషల ఆడియెన్స్ చూస్తున్నారు. దీపావళి సందర్భంగా నవంబర్ 1న రాబోతోన్న ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.
 *కిన్నాల్ రాజు మాట్లాడుతూ..* ‘ఉగ్రావతారంలోని ఫీల్, సోల్ మిస్ అవ్వకూడదని పాటలు, మాటలు రాశాను. ఇలాంటి మంచి చిత్రానికి మీడియా నుంచి సహకారం ఉండాలి. నవంబర్ 1న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు. (Story  : నవంబర్ 1న ‘ఉగ్రావతారం’)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version