Home వార్తలు తెలంగాణ రామప్ప ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలి

రామప్ప ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలి

0

రామప్ప ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలి

ప్రపంచ వారసత్వ సంరక్షణ కోసం స్వచ్ఛందంగా సేవ చేయాలి

రామప్ప నందు వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్ 2024 కార్యక్రమం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్

న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో :(వై. లకుమయ్య ) : రామప్ప ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలనీ, ప్రపంచ వారసత్వ సంరక్షణ కోసం స్వచ్ఛందంగా సేవ చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. మంగళవారం వెంకటపూర్ మండలం పాలంపేట లోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రామప్ప లో మూడవ వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ 2024 ట్రైనింగ్ ప్రోగ్రామ్, యువ టూరిజం క్లబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2024 ను జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్ 2024 – వర్కింగ్ ఆన్ ది ఫ్యూచర్’ అనే థీమ్‌తో వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్ 2024 ను 15 అక్టోబర్ 2024 నుండి 26 అక్టోబర్ 2024 వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రపంచ వారసత్వ సంరక్షణ కోసం స్వచ్ఛందంగా సేవ చేయడం ఒక ప్రత్యేకమైన అనుభవంమని అన్నారు. డబ్ల్యూ హెచ్ వి లో మాతో చేరండి” అనే నినాదంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమం కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ నిర్వహిస్తున్నదనీ, 40 మంది వాలంటీర్స్ దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి యువ టూరిజం క్లబ్స్ తెలంగాణ స్టేట్ లోని వివిధ కాలేజీల నుండి 40 మంది స్టూడెంట్స్ మొత్తంగా 80 మంది వాలంటీర్స్ పాల్గొనడం జరుతుందని తెలిపారు. చరిత్ర సాంస్కృతి సాంప్రదాయాలు పర్యాటకం కాకతీయుల చరిత్ర కాకతీయుల కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఇతర అంశాలపై లెక్చర్స్, ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయని, తెలంగాణ పర్యాటక శాఖ తెలంగాణ ప్రభుత్వం సహకారంతో నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
ట్రైనింగ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనదని, ట్రైనింగ్ లో దేశంలోని వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్ ద్వారా వివిధ సబ్జెక్టుల
మీద క్లాసు నిర్వహించడం జరుగుతూ ఫీల్డ్ ట్రిప్ లో కూడా చరిత్ర సాంస్కృతి సంప్రదాయాలు టెక్నాలజీ గురించి ఫీల్డ్ ట్రిప్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందని, ఇది ఒక మంచి
ఎన్లైట్మెంట్ గా వాలంటీర్స్ కి ఉపయోగపడుతుందని, స్టూడెంట్స్ ఏ సబ్జెక్టులు చదివినా కూడా చరిత్ర అనేది కంపల్సరీ ఏ సబ్జెక్టు వారికైనా అవసరం ఉంటుందనీ తెలుసుకోవడం చాలా ముఖ్యమైన దిగా భావించాలని చెప్పారు.
ప్రొఫెసర్ పాండురంగారావు మాట్లాడుతూ కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ రామప్పని దినేష్కో తీసుకురావడానికి ఏ విధమైన ప్రయత్నాలు జరిగినదని విషాధికరించారు.
కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ట్రస్ట్ మెంబర్ శ్రీధర్ రావు మాట్లాడుతూ కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ పుట్టుక దాని విధివిధానాలు పని విధానం ఏ విధమైన పనులు చేశార అనే దానిమీద విషీకరించారు.
జిల్లా టూరిజం అధికారి శివాజీ మాట్లాడుతూ యువ టూరిజం క్లబ్స్ ద్వారా స్టూడెంట్స్ కి పర్యాటక రంగం మీద ఎక్కువ ఆసక్తి కలుగుతూ వివిధ ప్రదర్శనలు ఇవ్వడం వలన విజ్ఞానం పొందవచ్చని అన్నారు.
ములుగు డిగ్రీ కాలేజ్ హిస్టరీ లెక్చరర్ లత మాట్లాడుతూ హిస్టరీ స్టూడెంట్స్ కి ఇలాంటి కోర్సెస్ చాలా ఉపయోగపడతాయని అన్నారు. చివరగా అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ మాట్లాడుతూ యువ టూరిజం క్లబ్స్ అనే కాన్సెప్ట్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా పరిచయం చేసి దేకో అపన దేశ్ అనే కార్యక్రమంలో భాగంగా మన చుట్టుపక్కల ప్రదేశాలను చూసి తర్వాత వేరే ప్రదేశాలకు చూడడానికి టూరిజం క్లబ్స్ అనే కాన్సెప్ట్ ద్వారా ప్రతి స్కూల్ కాలేజీ లో టూరిజం క్లబ్ క్రియేట్ చేసి పిల్లలకు పర్యాటకం చరిత్ర సంస్కృతి మీద అవగాహన కలిగే విధంగా ఈ క్లబ్స్ నిర్వహిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వహించడానికి ఉపయోగపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటాపూర్ రాజు, యోగ టీచర్ యోగి రాంబాబు, రామప్ప దేవాలయ టూరిస్ట్ గైడ్స్ విజయ్ వెంకటేష్ కేంద్రపురావస్తు శాఖ సిబ్బంది, దేవాదాయ శాఖ సిబ్బంది, పర్యాటక అభివృద్ధి సంస్థ సిబ్బంది శ్రావణ్, రంజిత్, దేశంలోని నలుమూల నుండి వచ్చిన వాలంటీర్స్ హైదరాబాద్ సిటీ కాలేజ్ స్టూడెంట్స్ వరంగల్ పింగిలి మహిళా కాలేజీ స్టూడెంట్స్ కాకతీయ యూనివర్సిటీలో ఇస్త్రీ స్టూడెంట్స్, టూరిజం స్టూడెంట్స్ కాకతీయ యూనివర్సిటీలోని జియాలజి స్టూడెంట్స్ ములుగు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ తమిళనాడు నుండి ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ హైదరాబాద్ జెఎన్టియు ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు. (Story : రామప్ప ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version