UA-35385725-1 UA-35385725-1

అక్టోబర్ 17న  ‘బఘీర’ రిలీజ్

అక్టోబర్ 17న  ‘బఘీర’ రిలీజ్

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా:  ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బఘీర’తో అలరించబోతున్నారు. ఉగ్రమ్, కెజిఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. KGF 1, కాంతార, సలార్ వంటి సినిమా మైల్ స్టోన్ మూవీస్ అందించిన  ప్రముఖ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించనుంది.

బఘీరలో రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.  టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. ఎజె శెట్టి డీవోపీ కాగా,  బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ప్రణవ్ శ్రీ ప్రసాద్ ఎడిటర్, రవి సంతేహక్లు ఆర్ట్ డైరెక్టర్.

థ్రిల్లింగ్ యాక్షన్, ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్, అద్భుతమైన విజువల్స్‌ని బ్లెండ్ చేసిన ఈ మూవీ కన్నడ సినిమాలో ఒక ల్యాండ్‌మార్క్ అవుతుందని ప్రామిస్ చేస్తోంది. పలు బ్లాక్‌బస్టర్‌లను విజయవంతంగా డిస్ట్రిబ్యూషన్ చేసిన టాలీవుడ్ టాప్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.

దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో బఘీర చిత్రం విడుదల కానుంది. పోస్టర్లు ప్రజెంట్ చేసినట్లుగా, శ్రీమురళి సినిమాలో ఇంటెన్స్, పవర్-ప్యాక్డ్ పాత్రను పోషించారు. తెలుగు ప్రమోషన్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ రుధిర హర అక్టోబర్ 17న ఉదయం 10:35 గంటలకు విడుదల కానుంది.

తారాగణం: శ్రీమురళి, రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్, తదితరులు

సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: విజయ్ కిరగందూర్
బ్యానర్: హోంబలే ఫిల్మ్స్
కథ: ప్రశాంత్ నీల్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: డాక్టర్ సూరి
తెలుగు విడుదల: ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: AJ శెట్టి
సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్
ఎడిటర్: ప్రణవ్ శ్రీ ప్రసాద్
యాక్షన్: చేతన్ డి సౌజా
ఆర్ట్ డైరెక్టర్: రవి సంతేహక్లు
పీఆర్వో: వంశీ-శేఖర్ (Story : అక్టోబర్ 17న  ‘బఘీర’ రిలీజ్)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1