UA-35385725-1 UA-35385725-1

మైత్రీ మూవీ మేకర్స్ #RAPO22 అనౌన్స్‌మెంట్

మైత్రీ మూవీ మేకర్స్ #RAPO22 అనౌన్స్‌మెంట్

న్యూస్ తెలుగు /హైద‌రాబాద్ సినిమా: ఉస్తాద్ రామ్ పోతినేని తన 22వ మూవీని దసరా పండగ సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో అలరించిన మహేష్ బాబు పచ్చిగొల్ల ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.
#RAPO22 రామ్ కెరీర్‌కు సిగ్నిఫికెంట్ ఎడిషన్ కానుంది. ఇటీవల యాక్షన్-ఓరియెంటెడ్ పాత్రలతో అలరించిన రామ్ ఈ మూవీలో ఓ యూనిక్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. రామ్ స్టైలిష్ మేకోవర్‌లో కనిపించనున్నారని అనౌన్స్‌మెంట్ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రం ఇంపాక్ట్ ఎమోషన్స్ ని ఎక్స్ ఫ్లోర్ చేయనుంది. రామ్ కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది.
దర్శకుడు మహేష్ బాబు తన మునుపటి చిత్రాలలో హ్యుమర్, ఎమోషన్స్ బ్లెండ్ చేసి అలరించారు , అప్ కమింగ్ మూవీ కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మూవీ లైట్ హార్టెడ్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయనుంది.
నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు, ఇందులో ప్రముఖ నటీనటులు, టాప్  టెక్నీషియన్లు పని చేయనున్నారు.
త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నికల్ టీం వివరాలు త్వరలో తెలియజేయనున్నారు మేకర్స్.
తారాగణం: రామ్ పోతినేని
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: మహేష్ బాబు పచ్చిగొల్ల
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
పీఆర్వో: వంశీ-శేఖర్ (Story : మైత్రీ మూవీ మేకర్స్ #RAPO22 అనౌన్స్‌మెంట్)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1