ధర్మవరం డివిజన్ లో పదిమంది కి వైన్ షాపులు కైవసం
ఎక్సైజ్ సీఐ చంద్రమణి
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పుట్టపర్తి జిల్లా ద్వారా లాటరీ పద్ధతిలో ధర్మవరం డివిజన్కు పదిమంది వైన్ షాప్ నిర్వహించుటకు అనుమతి లభించింది అని ఎక్సైజ్ చంద్రమణి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 10 షాపులకు సంధి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పురుషోత్తం గౌడ్, టి. రవీంద్ర రెడ్డి ( కామిరెడ్డిపల్లి), ఆర్ .రవికుమార్, కోళ్లమరం చంద్రశేఖర్ రెడ్డి, బాల్రెడ్డి, ఆంజనేయులు, ప్రకాష్ రెడ్డి, జగదీష్ కైవసం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఐదు దుకాణాలు దక్కించుకున్న అనంతపురం జిల్లా బిజెపి అధ్యక్షుడు సంధి రెడ్డి శ్రీనివాసులు–మద్యం దుకాణాల లాటరీలో బిజెపి అనంతపురం జిల్లా అధ్యక్షుడు సంధి రెడ్డి శ్రీనివాసులు పంట పండింది. ఆయన ఏకంగా ఐదు దుకాణాలను దక్కించుకున్నారు. సోమవారం పుట్టపర్తిలో కలెక్టర్ చేతన్ ఆధ్వర్యంలో లాటరీ తీయగా ధర్మవరం మున్సిపాలిటీలో ఒకటవ, నాలుగవ దుకాణాలు, ధర్మవరం రూరల్ లో 12వ దుకాణం, ముదిగుబ్బ మండలంలో 19వ దుకాణం, బత్తలపల్లి మండలంలో 14వ నెంబర్ దుకాణాలకు ఆయనకే దక్కాయి. ఒక్కరికే ఐదు దుకాణాలు దక్కడం గమనార్హం. ఈ సందర్భంగా శ్రీనివాసులకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. (Story : ధర్మవరం డివిజన్ లో పదిమంది కి వైన్ షాపులు కైవసం)