#NaniOdela2 గ్రాండ్ గా లాంచ్
న్యూస్ తెలుగు /హైదరాబాద్ సినిమా : నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ హిట్ ‘దసరా’ తర్వాత హైలీ యాంటిసిపేటెడ్ సెకండ్ కొలబరేషన్ కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) నిర్మాత సుధాకర్ చెరుకూరితో మళ్లీ చేతులు కలిపారు. #NaniOdela2 స్టన్నింగ్ పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్ దసరాకి 100 రెట్లు ఇంపాక్ట్ ని క్రియేట్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నట్లు నాని ఇటీవలే చెప్పారు.
దసరా పలు అవార్డులను అందుకోవడం, హ్యుజ్ పాపులారిటీని సాధించడంతో, ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడాయి. మేకర్స్ దసరా శుభ సందర్భంగా సినిమాని గ్రాండ్ గా లాంచ్ చేశారు,
శ్రీకాంత్ ఓదెల మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్‌లో నానిని ప్రెజెంట్ చేసే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకునే, లార్జర్ దెన్ లైఫ్ కథని రూపొందించారు. మోస్ట్ ఫెరోషియస్ పాత్ర కోసం నాని మేకోవర్ కి సిద్ధంగా ఉన్నారు.
పాషనేట్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సక్సెస్ ఫుల్ అండ్ డైనమిక్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ నానికి మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ సినిమా కానుంది.
ఈ హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ స్టొరీ టెల్లింగ్, ప్రొడక్షన్ క్యాలిటీ, టెక్నికల్ గా నెక్స్ట్ లెవల్ లో వుండబోతోంది. మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
తారాగణం: నాని
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో (Story : #NaniOdela2 గ్రాండ్ గా లాంచ్ )