పారిశుధ్య నిర్వాహణలో లోపం లేకుండా చూసుకోండి
నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
న్యూస్ తెలుగు/విజయవాడ : పారిశుద్ధ్య నిర్వహణలో ఏవిదమైన లోపం లేకుండా చూడాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సంబందిత అధికారులను ఆదేశించారు. కమిషనర్ నగర ర్యటనలో భాగంగా సోమవారం కృష్ణవేణి ఘాట్, పటమట హై స్కూల్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవాని భక్తులు విడిచి పెట్టే రెడ్ క్లాత్‌ను ఎప్పటికప్పుడు తీసేస్తూ పారిశుధ్య నిర్వహణ పక్కగా జరిగేలా చూడాలన్నారు. పారిశుధ్య నిర్వాహణను అధికారులు ఎప్పటికప్పుడు ప్రేవేక్షిస్తూండాలని ఆదేశాలించారు. అనంతరం పటమట హైస్కూల్ రోడ్‌లోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని ప్రజారోగ్య సిబ్బందికి ఆదేశించారు. టాయిలెట్స్ నిర్వహణలో నీటి సరఫరా, ఇంజనీరింగ్ తదితర అంశాలు ఇంజనీరింగ్ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకోవాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. అన్న క్యాంటీన్ కిచెన్‌లోని ప్లేట్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్న క్యాంటీన్‌ల స్పెషల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు ఆహారంలో నాణ్యతను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నొక్వల్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, ఇంజనీరింగ్, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.(Story : పారిశుధ్య నిర్వాహణలో లోపం లేకుండా చూసుకోండి)