అప్పుల బాధ భరించలేక మందుల షాపు యజమాని ఆత్మహత్య
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని సిద్దయ్య గుట్టకు చెందిన సి. శ్రీనివాసులు (40) గత కొన్ని సంవత్సరాలుగా మెడికల్ ఏజెన్సీ తో పాటు మందుల షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇటీవల కొన్ని నెలలుగా వ్యాపారం సరిగా జరగకపోవడం. వ్యాపార అభివృద్ధికి కొరకు దాదాపు 6 లక్షల వరకు అప్పులు తేవడం జరిగింది. కానీ తెచ్చిన అప్పులకు సరైన వ్యాపారం జరగకపోవడంతో, అప్పుల వాళ్లకి సమాధానం ఏమి చెప్పాలో తెలియక ఈనెల 13వ తేదీ ఇంట్లో ఎవరూ లేని సమయాన చున్నీతో ఉరివేసుకొని మృతి చెందాడు. వివరాలకు వెళితే మృతుడు శ్రీనివాసులు మందులు షాపు నడుపుకుంటూ, భార్య భువనేశ్వరి గృహిణిగా ఉండేది. వీరికి ఆరు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు వయసు గల ఇద్దరు కూతుర్లు కూడా కలరు. ఈనెల 13వ తేదీ ఉదయం 11 సమయంలో భార్య మండల పరిధిలోని సంగమేశ్వరం గుడికి పిల్లలతోపాటు వెళ్ళింది. భర్తను కూడా రమ్మని తెలుపగా, నాకు వేరే పని ఉంది మీరు వెళ్లి రండి అని తెలిపాడు.. తదుపరి మధ్యాహ్న సమయంలో ఇంట్లోనే చిన్నితో ఉరి వేసుకున్నాడు. మధ్య సమయములో భార్య పలుమార్లు భర్తకు ఫోన్ చేస్తే ఫోను లిఫ్ట్ చేయలేదని తెలిపింది. చివరకు శనివారం సాయంత్రం ఇంటికి చేరుకోగా కిటికీలోనుంచి ఉరి వేసుకున్న దృశ్యాన్ని చూచి చుట్టుపక్కల వాళ్లకు పిలిచింది, మృతదేహాన్ని కిందకు దించిగా, అప్పటికే మృతి చెందినట్లు తెలుసుకున్నారు. సమాచారాన్ని వన్ టౌన్ ఏఎస్ఐ రాజప్రసాద్ కు అందించారు. పోలీసులతో ఏఎస్ఐ ఎక్కడకు చేరుకొని జరిగిన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అతి చిన్న వయసులోనే ఇలా మృతి చెందడం కుటుంబాన్ని శోకసముద్రంలో ముంచేసింది. అనంతరం ఎస్ఐ రాజప్రసాద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు, బంధువులు, కుటుంబ సభ్యులు, మిత్రులు తెలుపుతున్నారు. (Story : అప్పుల బాధ భరించలేక మందుల షాపు యజమాని ఆత్మహత్య)