అప్పుల బాధ తాళలేక చేనేత కార్మికుడు ఆత్మహత్య
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని రాంనగర్ లో ఉడుముల రంగా (45) అప్పుల బాధ తాళలేక ఇంట్లోనే చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలకు వెళితే… మృతుడు ఉడుముల రంగా మగ్గం నేర్చుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కరోనా సమయం నుంచి నేటి వరకు నేసిన చీరలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పాటు ముడి సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరగడంతో, చేసేది లేక చీరలను నేస్తూ వచ్చాడు? కానీ నేసిన చీరకు సరి అయిన ధర రాకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. ముడి సరుకులకు నిర్ణీత ధర లేకపోవడంతో తగ్గడం, ఎక్కడంలాంటి ఘటనలు చేసుకోవడంతో నేసిన చీరకు గిట్టుబాటు ధర వచ్చేది కాదు అని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కుటుంబ పోషణకు పిల్లల చదువులకు ముడి సరుకులకు అధికంగా అప్పులు చేయడం జరిగింది. మరి ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక తరచూ మనోవేదనకు ఈ క్రమంలోనే ఇంటిలో మగ్గం వద్దనే ఫ్యాన్కు ఉరివేసుకొని శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం లేవగానే భర్త ఊరికి వేలాడుతూ కనిపించడంతో భార్యతో పాటు కుటుంబ సభ్యులు కూడా బోరున వినిపించారు. దాదాపు 5 లక్షల వరకు అప్పులు ఉన్నట్లు బంధువులు, స్థానికులు తెలుపుతున్నారు. తదుపరి చుట్టుపక్కల వారు వచ్చి మృతదేహాన్ని కిందకు దించారు. అప్పటికే ప్రాణం వెళ్లిపోయిందని,, చివరకు టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి మృతుని భార్య ఉడుముల రేవతి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, సవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.. మృతునికి భార్య ఉడుముల రేవతి తో పాటు కుమార్తె పావని కుమారుడు జస్వంత్ ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు, బంధువులు కోరుతున్నారు. (Story : అప్పుల బాధ తాళలేక చేనేత కార్మికుడు ఆత్మహత్య)