రోలర్‌కోస్టర్ రైడ్‌గా ‘నరుడి బ్రతుకు నటన’ ట్రైలర్
న్యూస్ తెలుగు /హైదరాబాద్ సినిమా : శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో నరుడి బ్రతుకు నటన అనే చిత్రం రాబోతోంది. ఇప్పటి వరకు వదిలిన కంటెంట్‌కు మంచి స్పందన వచ్చింది. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్ ఇతర ప్రముఖ తారాగణంతో రాబోతోన్న ఈ చిత్రానికి రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. టిజి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి ఈ సినిమాను నిర్మించగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవరించారు. సుధీర్ కుమార్ ప్రాజెక్ట్ హెడ్. ఈ సినిమా థియెట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ ఈరోజు రిలీజ్ చేశారు.
మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసి.. యూనిట్ కి అల్ ది బెస్ట్ తెలిపారు. ఈ ట్రైలర్.. శివ కుమార్ నటుడు అవ్వాలని ఆడిషన్స్ ఇస్తూ ఫెయిల్ అయ్యే సీన్ తో ఓపెన్ అవుతోంది. అందరూ అతడ్ని నిరుత్సాహ పరుస్తూనే ఉంటారు. జీవితం అంటే ఏంటో తెలిస్తేనే.. నటన తెలుస్తుందని చెప్పడంతో.. ఓ తెలియని ఊరికి వెళ్తాడు. అలా కథ హైద్రాబాద్ నుంచి కేరళకు షిఫ్ట్ అవుతుంది. ట్రైలర్ లో చూపించిన కేరళ అందాలు, సినిమాలోని ఎమోషన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచేలా ఉన్నాయి. హాస్యం, ప్రేమ, ఎమోషన్ ఇలా అన్ని రకాల అంశాలను జోడించి ఈ చిత్రాన్ని తీశారని ట్రైలర్ చెబుతోంది.
శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్ తమ పాత్రలను సమర్ధవంతంగా పోషించారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ప్రత్యేకమైన స్క్రిప్ట్‌ని ఎంచుకున్న రిషికేశ్వర్ యోగి దానిని ఆకర్షణీయంగా మలిచారనిపిస్తోంది. డైలాగ్స్ ఎమోషనల్‌గా ఉన్నాయి. ఫహద్ అబ్దుల్ మజీద్ కేరళలోని ప్రకృతి దృశ్యాలను చాలా అద్భుతంగా చిత్రీకరించారు. NYX లోపెజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషన్‌ను మరింతగా పెంచేసింది. అక్టోబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ సినిమాకి ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.
తారాగణం: శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వివా రాఘవ్, దయానంద్ రెడ్డి, తదితరులు.
సాంకేతిక సిబ్బంది
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
ప్రాజెక్ట్ హెడ్: సుధీర్ కుమార్
రచయిత – ఎడిటర్ – దర్శకుడు: రిషికేశ్వర్ యోగి
సినిమాటోగ్రాఫర్: ఫహద్ అబ్దుల్ మజీద్
సంగీత దర్శకుడు: NYX లోపెజ్
PRO: సాయి సతీష్ (Story : రోలర్‌కోస్టర్ రైడ్‌గా ‘నరుడి బ్రతుకు నటన’ ట్రైలర్ )