వాజేడు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
వార్షిక తనిఖీలో భాగంగా వాజీడు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరిష్
ఆదివాసీ ప్రజలకు అండగా ఉండాలని, చట్టాల పట్ల వారికీ అవగాహన కల్పించాలి
ఆదివాసీ ప్రజల ప్రాణాలు బలిగొంటున్న మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచాలి
ఫిర్యాదు దారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి
వారికీ కనీస అవసరాలు కల్పించాలి
విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవు
జిల్లా ఎస్ పి డా. శబరిష్
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో :(వై. లకుమయ్య ) : ఆదివాసీ ప్రజలకు అండగా ఉండాలని, చట్టాల పై వారికి అవగాహన కల్పించాలని,పోలీస్ లకు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ తెలిపారు.శుక్రవారం ములుగు జిల్లా వాజేడు మండల పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు. శుక్రవారం వార్షిక తనిఖీల్లో భాగంగా వాజీడు పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పి డా. శబరిష్ తనిఖీ చేసారు. స్టేషన్ లోని రికార్డ్స్ ను పరిశీలించి,కేసుల నమోదు వాటి యొక్క స్థితి గతులను తెలుసుకుని పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క కిట్ ఆర్టికల్స్, ఆయుధ సామాగ్రిని ని తనిఖీ చేసారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆదివాసీ ప్రజల ప్రాణాలు బలిగొంటున్న మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచాలన్నారు. మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచాలని, ఫిర్యాదు దారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని,వారికి కనీస అవసరాలు కల్పించాలన్నారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే, శాఖ పరమైన చర్యలు తప్పవు అన్నారు. బాధిత వ్యక్తుల నుంచి ఫిర్యాదును స్వీకరించిన అనంతరం వారికి వెంటనే రసీదు అందించాలని,ఎఫ్ ఐ ఆర్ నమోదు నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివాసి ప్రజలు ఎక్కువ సంఖ్యలో, ఉన్నందున, వారికి చట్టాల పట్ల అవగాహన కల్పించాలని వారికి అండగా ఉండాలని,మావోయిస్టు ప్రబంధ ప్రాంతమైనందున ప్రజల భద్రతనే ధ్యేయంగా పనిచేయాలని ఎస్పీ తెలియజేశారు. అనంతరం ఎస్పీ పోలీస్ స్టేషన్ ఆవరనలో గల నమోదు కాబడని లేదా వదిలివేయబడిన వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ ఉద్యోగం అనేది భాద్యతతో కూడుకున్నదని, క్రమశిక్షనతో ఉద్యోగం చేయాలనీ విధులలో నిర్లక్ష్యం వాయిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కార దిశగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటాపురం కుమార్, వాజీడు ఎస్సై హరీష్ , ఏ ఎస్ ఐ ఇమన్నావల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. (Story : వాజేడు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ)