మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే జీవీ, మక్కెన
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి ఘనస్వాగతం లభించింది. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ఆయనకు స్వాగతం పలికారు. వినుకొండ కొత్తపేటలోని నివాసం వద్ద మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా వినుకొండ వచ్చిన రాంప్రసాద్‌రెడ్డికి ఎమ్మెల్యే జీవీ అభినందలు తెలిపారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులను మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి పరిచయం చేశారు. (Story : మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే జీవీ, మక్కెన)