Home వార్తలు తెలంగాణ విషజ్వరాలు దరి చేరకుండా  ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

విషజ్వరాలు దరి చేరకుండా  ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

0

విషజ్వరాలు దరి చేరకుండా  ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

న్యూస్ తెలుగు /వనపర్తి : మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు దరి చేరకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం కలెక్టర్ కొత్తకోట మండలంలోని కానాయపల్లి గ్రామంలో పర్యటించి డ్రై డే నిర్వహణను పరిశీలించారు. గ్రామంలో ఇటీవల డెంగ్యూ బారిన పడిన వారి ఇంటిని సందర్శించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విష జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డ్రమ్ములు లేదా కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. అదేవిధంగా గ్రామంలోని వీధుల్లో పర్యటించి పరిసరాల పరిశుభ్రత గురించి ఆశా వర్కర్లు అవగాహన కల్పిస్తున్న విధానాన్ని పరిశీలించారు. గ్రామంలో ఫీవర్ సర్వే వివరాలను పరిశీలించారు. గ్రామంలో దోమల బెడద తగ్గించేందుకు ఫాగింగ్ చేయాలని పంచాయతి కార్యదర్శికి సూచించారు. అంతకుముందు కొత్తకోటకు మంజూరు అయిన 50 పడకల ఆస్పత్రి కోసం తహసీల్దార్ తో కలిసి గుంపుగట్టు సమీపంలో స్థల పరిశీలన చేశారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సందర్శన
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత లేకుండా చూసుకోవాలని, అవసరమైన మందుల్ని సీడీఎస్ నుంచి తెప్పించాలని వైద్యాధికారులకు సూచించారు. కొత్తకోట, మదనాపురం మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఆస్పత్రుల్లోని ఈడిడి, ఒపి రిజిస్టర్లను పరిశీలించిన అనంతరం ఐపీ, డెలివరీ వార్డులను కలెక్టర్ పరిశీలించారు. ఐపీ వార్డులో చికిత్స పొందుతున్న గర్భిణులకు హిమోగ్లోబిన్ మెరుగుదల కోసం మంచి ఆహారాన్ని తీసుకోవాలని జాగ్రత్తలు చెప్పారు. రోగులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా అని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణుల డెలివరీల వివరాలను అడిగిన కలెక్టర్ మెరుగైన పనితీరు కనబరిచిన సిబ్బందిని అభినందించారు. ల్యాబ్ లో రోగులకు చేస్తున్న పరీక్షల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మదనాపురం మండలంలోని వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్ లో నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను సందర్శించి ఎలా నడుస్తోంది. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కొత్తకోట తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మదనాపురం తహసీల్దార్ అబ్రహం, ఎంపీడీవో ప్రసన్న కుమారి, వైద్య శాఖ ఏవో సాయినాథ్ రెడ్డి, పీవో పరిమళ, వైద్యాధికారిణి అసియా బేగం, తదితరులు ఉన్నారు. (Story : విషజ్వరాలు దరి చేరకుండా  ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version