అత్యంత వైభవంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని కొత్తపేటలో గల టీచర్స్ కాలనీలో శ్రీ మహాలక్ష్మి చౌడేశ్వరి దేవి ఆలయంలో శరన్నవరాత్రుల మహోత్సవ వేడుకలు ఆలయ కమిటీ, ఆధ్వర్యంలో 9వ రోజు అమ్మవారు ధనలక్ష్మి అలంకరణలో భక్తాదుల కు దర్శనం ఇచ్చారు.
పట్టణంలోని సాలే వీధిలో గల పుట్లమాంబ దేవి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలోఅర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారు దేవి 9వ రోజు దుర్గాదేవి అలంకరణములో భక్తాదులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ గిర్రాజు ప్రసాద్, గిర్రాజు నగేష్, కోటమ్ రవి తదితరులు పాల్గొన్నారు.
పట్టణములోని శివానగర్, కేశవ నగర్ లలో వెలసిన శ్రీ విజయ చౌడేశ్వరి దేవి ఆలయంలో శరన్నవ రాత్రుల మహోత్సవ వేడుకలు లో భాగంగా అమ్మవారు భాగంగా 9వ రోజు మహిషాసుర మర్దిని దేవి అలంకరణలో భక్తాదులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ సేవా కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : అత్యంత వైభవంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు)