100 రోజుల టీడీపీ పాలనలో పరుగులు తీస్తున్న అభివృద్ధి పనులు
మంత్రి రాంప్రసాద్ రెడ్డి
న్యూస్ తెలుగు /వినుకొండ : టిడిపి ప్రభుత్వం ఏర్పడగానే వంద రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలతో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్టిసి డిపోలో నూతనంగా మంజూరైన రెండు ఇంద్ర బస్సులు, నాలుగు ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా గ్యారేజీలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ. నూతన ప్రభుత్వం ఏర్పడగానే అభివృద్ధి పనులు శరవేగంతో ముందుకు సాగుతున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి 1450 కొత్త బస్సులు సమకూర్చినట్లు ఆయన తెలిపారు. మంచి ప్రభుత్వం ఏర్పడితేనే మంచి పనులు జరుగుతూ ఉంటాయన్నారు. ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి 4000/- రూపాయలు చొప్పున పెన్షన్ పెంచి ఇవ్వడం జరిగిందన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని, నూతన ప్రభుత్వం ఏర్పడగానే డీఎస్సీ ద్వారా వందల సంఖ్యలో ఉద్యోగ కల్పన జరిగిందన్నారు. ఇక పేదల కడుపు కొట్టిన జగన్ ప్రభుత్వం, నూతన ప్రభుత్వం ఏర్పడగానే 175 అన్నా క్యాంటీలను ఏర్పాటు చేసి పేదల కడుపు నింపుతుందన్నారు. విజయవాడ వరద బీభత్సాన్ని అధిగమించేందుకు. యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగులను, కార్మికులను రప్పించి వరద బాధితులను ఆదుకున్నారన్నారు. ఇక వినుకొండ ఆర్టిసి డిపో రూపు రేఖలు మార్చివేసి మోడల్ బస్టాండ్ గా తీర్చిదిద్దేందుకు, అలాగే ఇండోర్ స్టేడియం నిర్మాణాలకు స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు నిధులు అడిగారని, ముఖ్యమంత్రితో మాట్లాడి వెంటనే నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. రానున్న దీపావళి నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించ నున్నట్లు మంత్రి తెలిపారు. జగన్ ప్రభుత్వం ఐదేళ్లు బటన్ నొక్కుడు అంటూ కాలయాపన చేశారని, వైకాపా నిలిపివేసిన అభివృద్ధి పనులన్నీ నేడు టిడిపి ప్రభుత్వం పూర్తి చేస్తున్నది అన్నారు. కేంద్ర సహకారంతో పోలవరం ప్రాజెక్టు తో సహా పలు భారీ అభివృద్ధి పనులు జరుగుతాయి అన్నారు. ఎమ్మెల్యే జివి మాట్లాడుతూ. వినుకొండ ఆర్టీసీ డిపోను 15 కోట్లతో మోడల్ బస్టాండ్ గా తీర్చిదిద్దేందుకు నిధులు కోరిన వెంటనే మంత్రి హామీ ఇచ్చారని ఈ సందర్భంగా అన్నారు. అలాగే స్థానిక ఎన్.ఎస్.పి. స్థలంలో ఐదు కోట్లతో ఇండోర్, అవుట్డోర్ స్టేడియం నిర్మించనున్నట్లు జీవి తెలిపారు. జగన్ రెడ్డి హయాంలో అంతా విధ్వంసం తప్ప, ఢిల్లీ నుండి ఒక్క రూపాయి నిధులు రాలేదన్నారు. నేడు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి పోలవరం పనులకు అడ్వాన్స్ నిధులు, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుమతులు తెచ్చారన్నారు. జగన్ రెడ్డి హయాంలో విదేశీ పరిశ్రమలన్నీ పారిపోయాయని, నేడు మరల బాబు కృషి పట్టుదల చూసి ఆ కంపెనీలన్నీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. జగన్ రెడ్డి ఉన్నంతకాలం సైకో పాలన తో పాటు 14 లక్షల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లిపోయాడని జీవి అన్నారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు మాట్లాడుతూ. కోట్లాది రూపాయల విలువైన మూడున్నర ఎకరాల ఆర్టిసి డిపో స్థలం ఉందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్టాండ్ ను అభివృద్ధి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మోడల్ బస్టాండ్ తీర్చిదిద్దేందుకు నిధులు విడుదల చేసేందుకు అంగీకరించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గ్యారేజీ ఆవరణలో వివిధ రకాల మొక్కలను నాటారు. ఆర్టీసీ స్థానిక ఉన్న తాధికారులు ఘన స్వాగతం పలికారు. అలాగే ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు మంత్రిని ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు, బిజెపి నాయకులు ఎం.రమేష్., ఆర్టీసీ ఈ.డి. గిడుగు వెంకటేశ్వరరావు, ఆర్ఎం. శ్రీనివాసరావు, డిపో మేనేజర్ జవ్వాది నాగేశ్వరరావు, ఈ.యు. నాయకులు పి.సాంబశివరావు, ఎస్కే. ఖాజా , టిడిపి నాయకులు, ఆర్టీసీ అధికారులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (Story : 100 రోజుల టీడీపీ పాలనలో పరుగులు తీస్తున్న అభివృద్ధి పనులు)