వైసీపీ పాలన అంతానికి గుర్తుగా ఈ దసరా వేడుకలు
సుగాలీ ఆడపడుచులకు శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ దసరా కానుక
మహిళలకు చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : రాష్ట్రంలో జగన్ రాక్షస పాలన అంతానికి గుర్తుగా ఈ దసరాను ప్రజలంతా ఎంతో సంతోషంతో చేసుకుంటారని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. రాష్ట్రంలో జగన్ రాక్షస పాలనపోయి మళ్లీ చంద్రన్న పాలన, రామరాజ్యం వచ్చిందని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండటానికి బాటలు వేస్తున్నామన్నారు. దసరా పండగను పురస్కంరించుకుని వినుకొండ శివారులోని అతిథిగృహం వద్ద బుధవారం శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుగాలీ ఆడపడుచులకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చీరలు పంపిణీ చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో దసరా జరుపుకోవాలని చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నానని తెలిపారు. ఈసారి దీపావళికి ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయబోతున్నారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో మహిళలకు ఎన్నో పథకాలు అందిస్తున్నామన్నారు. గతంలో చంద్రబాబు 500కిపైగా జనాభా ఉన్న తండాలను పంచాయతీలు చేసి సిమెంట్ రోడ్లు వేశారని, సైడ్ కాల్వలు కట్టించారన్నారు. జగన్‌రెడ్డి పాలనలో ఒక్క తండాలో కూడా చిన్న రోడ్డు కూడా వేసిన పాపాన పోలేదన్నారు. ఇదే సమయంలో నియోజకవర్గం పరిధిలో ఎవరైనా ఆడపిల్లల జోలికెళితే తాటతీస్తామని హెచ్చరించారు. గ్రామాల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. గతంలో ఆగస్టు 15కి ఒక్కో పాఠశాలకు రూ.వందల్లో ఇచ్చారని, ఆ డబ్బులను ప్రజలను అడిగినా ఇస్తారని, చంద్రబాబు పాలన వచ్చిన తర్వాత పవన్‌కల్యాణ్ ఒక్కో పాఠశాలకు స్థాయిని బట్టి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు ఇచ్చారన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతి తండాలో సిమెంట్ రహదారులు వేశామన్నారు. వెంకట్‌రెడ్డిపురం తండాకు తారురోడ్డు వేశామని, జగన్‌రెడ్డి పాలనలో ఎప్పుడైనా వేశారా అని ప్రశ్నించారు. వెంకట్‌రెడ్డిపురం తండా, లింగంగుంట్ల తండా, మాలపాడు తండా, చెంచుగుంట తండా, అనేక తండాలకు తారురోడ్లు వేశామన్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో రహదారులు కాదు కదా కనీసం గుంతలు పూడ్చలేకపోయారని ఎద్దేవా చేశారు. గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని వారం రోజుల్లో మొదలుపెడతామని, ప్రత్యేకంగా గ్రాంట్లు తీసుకొచ్చి కొత్త రహదారులు కూడా వేస్తామన్నారు. పేదలకు ఇళ్లు ఇస్తామని, ఇల్లు కట్టుకోవడానికి ఒక్కో పేదవాడికి రూ.4 లక్షలు అందిస్తామన్నారు . ఇంటి స్థలం లేనివారికి ఎన్టీఆర్ కాలనీలు వేసి 3 సెంట్ల స్థలాలు ఇస్తామన్నారు. రానున్న 6-7 ఏళ్లలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను కలిశానని, తప్పకుండా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చానని, ఇప్పటికే ఆవిషయం గురించి చంద్రబాబు, లోకేష్‌తో మాట్లాడానని, త్వరలోనే పవన్‌కల్యాణ్‌ను కలవబోతున్నానని, ఇంటింటికీ మంచినీళ్లు ఇవ్వడానికి కచ్చితంగా నిధులు తీసుకొస్తామని, రానున్న 3 ఏళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ వేసి మంచినీళ్లు ఇచ్చి ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలన్న, వారి భవిష్యత్తు బాగుండాలన్న చంద్రన్న చల్లని పాలన, ఎన్డీఏ పాలనను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త నాగశ్రీను రాయల్, ఉమ్మడి జిల్లాల జనసేన కన్వీనర్ నిశ్సంకర శ్రీనివాసరావు, బీజేపీ నాయకుడు మేడం రమేష్, బొల్లాపల్లి మండల పార్టీ అధ్యక్షుడు జరపాల గోవింద నాయక్, టీడీపీ నాయకుడు హనుమాన్ నాయక్, పెమ్మసాని నాగేశ్వరరావు, కోట నాయక్, పీవీ సురేష్‌బాబు, పత్తి పూర్ణచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. (Story : వైసీపీ పాలన అంతానికి గుర్తుగా ఈ దసరా వేడుకలు)