Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ దసరా కానుకగా ఎన్టీఆర్ వైద్య మిత్రలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

దసరా కానుకగా ఎన్టీఆర్ వైద్య మిత్రలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

0

దసరా కానుకగా ఎన్టీఆర్ వైద్య మిత్రలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

రాష్ట్ర అధ్యక్షులు మాచర్ల బుజ్జి

న్యూస్‌తెలుగు/వినుకొండ : డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ఆరోగ్య భీమా విధానములో మారుస్తున్నారని ఇప్పటికి ప్రభుత్వం టెండర్ల ఆహ్వానించడం జరిగింది. ఈ విధానాన్న విధానం వల్ల 25 లక్షల వరకు కవర్ అవుతుందని రోగులకు న్యాయం జరుగుతుందని బుధవారం ఎన్టీఆర్ వైద్య మిత్ర రాష్ట్ర అధ్యక్షులు మాచర్ల బుజ్జి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విధానం పట్ల ఎన్టీఆర్ వైద్య మిత్ర దళిత గిరిజన కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు మాచర్ల బుజ్జి స్వాగతించడం జరిగింది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల పేద ప్రజలకు మేలు కలుగుతుందని ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షించటం జరిగింది అయితే ఆరోగ్య భీమా విధానములోకి తీసుకెళ్లేటప్పుడు గతంలో ఆరోగ్యశ్రీ పథకం ప్రస్తుతం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో 18సంవత్సరాల నుండి వైద్య మిత్రాలుగా ఉద్యోగాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పథకంలో పనిచేస్తున్న వైద్య మిత్రాలను ఇన్సూరెన్స్ విధానంలోనికి తీసుకెళ్లేటప్పుడు వారికి సమాన పనికి సమాన వేతనం మరియు ఉద్యోగ భద్రత కల్పించి హెచ్చరి పాలసీ అమలు చేయాలని సీనియార్టీని దృష్టిలో ఉంచుకొని కాంట్రాక్ట్ విధానంలోకి మార్చాలని ప్రభుత్వం ఈ పథకంలో పనిచేస్తున్న వైద్య మిత్రాలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పరిధిలో కొనసాగించి మరియు ఆప్స్కాస్ విధానంలో వారికి జీతాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వైద్య మిత్ర కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు మాచర్ల బుజ్జి రాష్ట్ర కార్యదర్శి కాకాని అప్పారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 25 వేల వేతనం ఉన్న ప్రతి ఉద్యోగికి రేషన్ కార్డు తల్లికి వందనం మరియు ఇతర పథకాలు వర్తించే విధంగా రేపు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల గురించి నిర్ణయం తీసుకుంటారని అదేవిధంగా దసరా కానుక ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు హెల్త్ బీమా విధానంలో వైద్య మిత్రులకు సీనియార్టీ కి ప్రాధాన్యత ఇచ్చి కాంట్రాక్ట్ విధానములో మార్చి క్యాడరు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు సానుకూల నిర్ణయం తీసుకుంటారని రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్య మిత్రాలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రభుత్వం దసరా కానుక ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు తగు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. (Story : దసరా కానుకగా ఎన్టీఆర్ వైద్య మిత్రలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version