Home వార్తలు “కార్తికేయ 2” సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డ్

“కార్తికేయ 2” సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డ్

0

“కార్తికేయ 2” సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డ్

దర్శకుడు చందూ మొండేటి

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా: తెలుగు సినిమా గర్వంచే క్షణాలను చిత్ర పరిశ్రమకు అందించారు టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి. ఆయన రూపొందించిన కార్తికేయ 2 సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా కార్తికేయ 2 చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డ్ స్వీకరించారు దర్శకుడు చందూ మొండేటి మరియూ నిర్మాత అభిషేక్ అగర్వాల్. ఈ సందర్భంగా టీమ్ కు సినీ పరిశ్రమలోని పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  నిఖిల్ హీరోగా కృష్ణతత్వాన్ని, శ్రీకృష్ణుడి గొప్పదనం తెలియజేస్తూ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీగా కార్తికేయ 2 చిత్రాన్ని రూపొందించారు చందూ మొండేటి. త్వరలో ఈ సినిమాకు మరో సీక్వెల్ కార్తికేయ 3 కూడా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా పాన్ ఇండియా మూవీ “తండేల్” రూపొందిస్తున్నారు చందూ మొండేటి. మరికొన్ని భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు సన్నాహాలు చేస్తున్నారీ టాలెంటెడ్ డైరెక్టర్. ఈ చిత్రాలతో చందూ మొండేటి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుందాం. (Story : “కార్తికేయ 2” సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డ్ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version