UA-35385725-1 UA-35385725-1

యువతకు, ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు షార్ట్ ఫిలిమ్ పోటీలకు ఆహ్వానం

యువతకు, ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు షార్ట్ ఫిలిమ్ పోటీలకు ఆహ్వానం

జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్

న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో. (వై. లకుమయ్య ) : శాంతి భద్రతల సమాజ రక్షణలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా పెట్టి, పోరాడి వీరమరణం పొందిన అమర పోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 21 నాడు జరుగు “ పోలీస్ ఫ్లాగ్ డే ” సందర్భంగా పోలీస్ సంబంధిత అంశం మీద ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం తీయడానికి జిల్లాలో ఆసక్తి గల యువత ఔత్సహిక ఫోటోగ్రాఫర్లు ముందుకు రావాలని జిల్లా ఎస్పీ డా”శబరీష్ ఒక పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసుల త్యాగాలు, విధుల్లో కనబరుస్తున్న తెగువ,ప్రతిభను తెలిపే విధంగా ఉండేలా తీసిన (3) ఫోటోలు, తక్కువ నిడివి (3 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ తీసి ఈ నెల 20-10-2024 నాడు సాయంత్రం వరకు మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ డి ఎస్ పి ములుగు కార్యాలయంలో కానీ అందచేయాలన్నారు. మెయిల్ ద్వారా పంపించేవారు sp-mulugu@tspolice.gov.in అను మెయిల్ కి పంపించాలి. ఇట్టి షార్ట్ ఫిలిం 3 నిమిషాలు మించకూడదని,10 x 8 సైజ్ ఫోటోలను ,షార్ట్ ఫిలింను సిడిలో లేదా పెన్ డ్రైవ్ లో మీ యెక్క పూర్తి వివరాలతో అందచేయాలని కోరారు.జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయిన మూడు షార్ట్ ఫిలింలను, స్టేట్ కాంపిటేషన్ గురించి డీజీపీ ఆఫీస్ హైదరాబాదుకు పంపించడం జరుగుతుందన్నారు. (Story : యువతకు, ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు షార్ట్ ఫిలిమ్ పోటీలకు ఆహ్వానం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1