భక్తి పార్యవైశ్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవ వేడుకలు
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణంలోని కొత్తపేటలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు 7 వ రోజు సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు సుదర్శన చార్యులు, అనిల్ కుమార్ ఆచార్యులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ, ట్రస్ట్ సభ్యులు మెటికల కుల్లాయప్ప, శంకర సంజీవులు, దత్త సాంబశివ, రంగా శ్రీనివాసులు, గుత్తి రామాంజనేయులు, నాగప్ప, సాగా సురేష్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా రామ్ నగర్ లోని శ్రీ చౌడేశ్వరీ దేవి కట్టవద్ద గల శ్రీ చౌడేశ్వరీ దేవి ఘనంగా దసరా శరన్నవరాత్రుల వేడుకలు జరుపుకున్నారు. ఏడవ రోజు అమ్మవారు సరస్వతి దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామకృష్ణ, పూజారి గంగా ప్రసాద్, బాలు పెద్ద వెంకటేష్ రంగయ్య వరదరాజులు, మారుతి కుమార్, చింత ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
గాంధీనగర్ లోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో 33 వ శరన్నవరాత్రుల మహోత్సవ వేడుకలు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అమ్మవారు ఏడవ రోజున సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రంగం ఆదినారాయణ, కార్యదర్శి నీలూరి నారాయణస్వామి, కోశాధికారి లక్ష్మీ నరసింహులు, తదితర కమిటీ సభ్యులు భక్తాదులు పాల్గొన్నారు. (Story : భక్తి పార్యవైశ్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవ వేడుకలు)