ఎల్బీ స్టేడియం కు బయలు దేరిన డీఎస్సీ ఉద్యోగులు
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో. (వై. లకుమయ్య )
2024 డీఎస్సీ నియామక ప్రక్రియలో భాగంగా ములుగు జిల్లా నుండి 178 మంది అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు తీసుకోవడానికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కి హాజరు కావడం జరిగింది. వీరిని ఎల్బీ స్టేడియంలో జరిగే నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరు కావడానికి ములుగు జిల్లా కలెక్టర్ శ్రీ దివాకర టి ఎస్ ఆధ్వర్యంలో 4 బస్సులు ఏటూరునాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట, ములుగు నుండి ఏర్పాటు చేసి, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నలుగురు లైజనింగ్ ఆఫీసర్లు, 8 మంది సహాయలైనింగ్ ఆఫీసర్లు, ప్రతి బస్సుకి మెడికల్ సిబ్బంది, పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం, రాత్రి భోజన వసతి ఏర్పాటు చేసి హైదరాబాద్ పంపించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని, కలెక్టరేట్ ఏవో రాజ్ కుమార్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, జిల్లా సైన్స్ అధికారి జయదేవ్ ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరిగింది. (Story : ఎల్బీ స్టేడియం కు బయలు దేరిన డీఎస్సీ ఉద్యోగులు)