గీతాజ్ఞాన యజ్ఞాన్ని జయప్రదం చేయండి
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ప్రముఖ ఉపన్యాసకురాలు శ్రేయానంద మాతాజీ ఆధ్వర్యంలో నిర్వహించే గీతా జ్ఞాన యజ్ఞాన్ని జయప్రదం చేయాలని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జూటూరు రమణయ్య తెలిపారు. బుధవారం స్థానిక కన్యకా పరమేశ్వరి దేవాలయం లో ఆర్యవైశ్య సంఘం వాటి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో గీతా జ్ఞాన యజ్ఞానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలనుకమిటీ సభ్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జూటూరు రమణయ్య మాట్లాడుతూ ప్రముఖ ఉపన్యాసకురాలు శ్రేయానంద మాతాజీ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు గీత జ్ఞాన యజ్ఞానికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని పట్టణంలోని కళా జ్యోతి ఆవరణంలో 17 నుంచి 23 వరకు సాయంత్రం 6:30 నుంచి ఎనిమిది గంటల వరకు,18 నుంచి 23 వరకు ఉదయం 10:30 నుంచి 11:30 వరకు స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో గీత జ్ఞాన యజ్ఞానికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కావున ప్రతి ఒక్కరు సకాలంలో కార్యక్రమానికి హాజరై గీత జ్ఞాన యజ్ఞాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్లంపల్లి సుదర్శన్ గుప్తా, కార్యదర్శి తబ్జుల్ శ్రీనివాసులు, కోశాధికారి పిన్ను అశోక్ కుమార్, దేవాలయ కమిటీ చైర్మన్ పిన్ను శ్రీనివాస్ ప్రసాద్, పి ఆర్ ఓ గ్రంధే శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్ అంబటి బద్రీనాథ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు మురళీకృష్ణ, భాస్కర్, సుబ్బయ్య, రేపాకుల రాజశేఖర్ , సుబ్బయ్య,వాసవి మహిళా మండల అధ్యక్షురాలు పొలమడ రూపరాగిణి, తదితరులు పాల్గొన్నారు. (Story : గీతాజ్ఞాన యజ్ఞాన్ని జయప్రదం చేయండి)