UA-35385725-1 UA-35385725-1

న్యాయంగానే మా పట్టాలు సాధించుకున్నాం..

న్యాయంగానే మా పట్టాలు సాధించుకున్నాం..

ఎలక్ట్రికల్ ప్లంబర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సురేంద్ర

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : న్యాయంగానే మా పట్టాలను సాధించుకున్నామని, ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు అని ఎలక్ట్రికల్ ప్లంబర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సురేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ లో వారు విలేకరులతో మాట్లాడుతూ కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లడంతో 2022లో ప్లంబర్స్ అసోసియేషన్కు ఆ భూమిని కేటాయిస్తూ కోర్టు తీర్పునివ్వడంతో, ప్రభుత్వ పెద్దల సహకారంతో ఉన్న భూమిని పంచుకోవడం జరిగిందని తెలిపారు. పట్టణములోని 650-2 సర్వే నెంబర్లు 20 సంవత్సరాల క్రితం అసోసియేషన్ కింద ఉండే ప్లంబర్స్ పట్టాల కోసం ప్రభుత్వం స్థలం కేటాయించిందని తెలిపారు. కాకపోతే కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లడంతో అప్పటినుంచి పెండింగ్లో పడుతోందని, 2022 హైకోర్టు ప్లంబర్స్ అసోసియేషన్కు అనుకూలంగా తీర్పు రావడం జరిగిందని తెలిపారు. తీర్పు అనంతరం అప్పట్లో ఉన్న ఆర్డీవో మమ్ములను ప్రతిపాదనలు సైతం పిలిపించి రాజీ చేసి ముందుకు వెళ్లాలని సూచించడంతో అందుకు తమ సమ్మతించడం జరిగిందని తెలిపారు. తొలుత 53 మందికి పట్టాలు ఇవ్వగా ఒక్కొక్కరికి రెండున్నర నుంచి మూడు సెంట్లు వరకు కేటాయించడం జరిగిందని వారు తెలిపారు. ఇందులో భాగంగానే 20 ఏళ్ల వ్యవధిలో ఆ భూమిని కొందరు కబ్జా చేయగా, మిగిలిన 1.34 ఎకరాలలో ఒక్కొక్కరికి 1.25 చెట్ల చొప్పున పంపిణీ చేయగా ప్లంబర్స్ లోని కొందరు ముఖ్యులు 20 ఏళ్ల నుంచి కోర్టు ఖర్చులు భరించడంతో వారికి మాత్రమే రెండు పట్టాలు చొప్పున ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజీ మార్గంలో వెళ్లడం జరిగిందన్నారు. అయితే బిజెపి నాయకుడు గొడుగు నాగరాజు సోము మరో ఇద్దరు 20 రోజుల క్రితం తమ వద్దకు వచ్చి తమ నిర్మాణ పనులు చేస్తుంటే ఆపేయాలని బెదిరించడం లేదంటే 50 లక్షల తో పాటు 15 సెంట్లు స్థలం ఇవ్వాలని వారు డిమాండ్ చేయడం జరిగిందని వారు ఆరోపించారు.ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించినందుకు ఏకంగా జెసిబి లతో నిర్మాణాలను కూల్చివేయడమే కాకుండా దుర్భాషలాడటం మమ్ములను చాలా బాధ కలిగించిందని తెలిపారు. అంతేకాకుండా ఎన్ డి ఏ కూటమి కూడా సహకరించిందంటే తమ వైపు న్యాయం ఉండడం వల్లనే తమకు న్యాయం జరిగిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా న్యాయం అన్యాయాలను విచారించి తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి రాజు సహకార దర్శి లదీప్, కోశాధికారి ఇస్మాయిల్ జుబేర్, సభ్యులు చంద్ర, వీరారెడ్డి, జాహీద్, అంజి, కృష్ణ, మాధవ, జిలాన్ భాష, అనిల్ కుమార్, హసీమ్ ,అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. (Story : న్యాయంగానే మా పట్టాలు సాధించుకున్నాం..)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1