UA-35385725-1 UA-35385725-1

మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి

మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి

దసరా లోపే పెండింగ్ జీతాలు చెల్లించాలి

సిఐటియు వనపర్తి జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు

న్యూస్‌తెలుగు/వనపర్తి : గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ సిఐటియు వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మర్రికుంట పాల కేంద్రం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి. ఏవో భాను ప్రకాష్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు మాట్లాడుతూ. దసరా దీపావళి పండుగలు ఉన్న గ్రామపంచాయతీ కార్మికులకు మూడు నాలుగు నెలల నుండి జీతాలు బకాయిలు ఉన్నాయని. పండుగకు కూడా జీతాలు రాకపోతే వారు ఎలా పండుగలు చేసుకోవాలని ప్రశ్నించారు. ఇచ్చే జీతాలు తక్కువ అని పైగా నెలల తరబడి జీతాలు బకాయి ఉండడంతో కార్మికులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే దసరా లోపల జీతాలు చెల్లించాలని. మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని. బట్టలు సబ్బులు నూనెలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల పనులు చేస్తూ గ్రామాలను పరిశుభ్రతకు పచ్చదనానికి నిలయంగా నిలుపుతున్న కార్మికులకు నెలల తరబడి జీతాలు రాకపోవడం దారుణమని. కార్మికుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదని. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని జీతాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులపై పని భారం తగ్గించాలని వేధింపులు ఆపాలని. ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు వారి కుటుంబంలో ఉద్యోగం ఇచ్చి 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు.. జీవో నెంబర్ 51 సవరించాలని. వారంతపు సెలవులు పండుగ సెలవులు ఇవ్వాలని. పిఎఫ్ ఇఎఫ్సి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సూర్యవంశం రాము,  సిఐటియు జిల్లా నాయకులు  నందిమల్ల  రాములు మధు గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షులు హనుమంతు నాయక్ జిల్లా కోశాధికారి పుష్ప శీను దాసు వెంకటేష్ లక్ష్మన్న రాజు నారాయణ శ్రీను కురుమయ్య జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. (Story : మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1