సబ్సిడీపై ట్రాక్టర్లు.. యంత్ర పరికరాలు అందజేత
న్యూస్ తెలుగు/ సాలూరు : సబ్సిడీపై ట్రాక్టర్లు. యంత్ర పరికరాలు. టర్బన్లు .స్పెయిర్లు ప్రభుత్వం ఇస్తుందని రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ సంచాలకులు రాబర్ట్ పాల్ అన్నారు మంగళవారం సాలూరు మండలంలో గల మామిడిపల్లి మరియు అన్నంరాజువలస రైతు సేవా కేంద్రాల పరిదిలో వ్యవసాయ అనుబంధ శాఖల సమన్వయంతో పొలం పిలుస్తుంది* కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ సంచాలకులు (JDA) రాబర్ట్ పాల్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో ఉన్న ప్రతీ మండలం లో ప్రతీ మంగళ & బుధ వారాల్లో ఈ కార్యక్రమం వ్యవసాయ & అనుబంధ శాఖల సమన్వయంతో జరుగుతుంది అని, అన్నారు రైతులు అందరూ హాజరయ్యి తమ సందేహాలను నివృత్తి చేసుకుంటూ, వారికి అవసరం అయినా సలహాలు , సూచనలు తీసుకోవలసిందిగా రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో వరి పంటలో ముఖ్యంగా పాము పొడ తెగులు ఎక్కువుగా ఉంది అని – నివారణ కొరకు హెక్సాకొనజోల్ 2ML/L లేదా ప్రోపికొనజోల్ 1ml/L నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలని అన్నారు సబ్సిడీపై ట్రాక్టర్లు యంత్ర పరికరాలు స్పేర్లు ప్రభుత్వం ఇస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సాలూరు ADA M. మధుసూదన్ రావు మాట్లాడుతూ మొక్కజొన్న లో కత్తెర పురుగు ఎక్కువుగా పంటను ఆశించి నష్టం కలిగిస్తుంది అని, కావున రైతులు అందరూ ఇమామెక్టీన్ బెంజోయేట్ మందును ఎకరానికి 100 గ్రా. చొప్పున పిచికారి చేసుకోవాలని అన్నారు. మండల వ్యవసాయ అధికారి P. అనూరాధ పండా మాట్లాడుతూ పొలం పిలుస్తుందనే కార్యక్రమం రైతులకు చాలా ఉపయోగపడుతుందని .ప్రతి ఒక్క రైతు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సూచనలను అనుసరిస్తూ వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలని అన్నారు.
హార్టికల్చర్ సీనియర్ సైంటిస్ట్ శ్రీనివాస రాజు మాట్లాడుతూ అరటి,ఆయిల్ పామ్, కోకో & జీడి మామిడి లో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఉద్యాన శాఖ లో గల పలు పథకాలు వాటి ప్రాముఖ్యతను గురించి కూడా రైతులకు తెలిపారు. అలాగే డ్రిప్ & స్ప్రింకలర్లు సబ్సిడీ లో అందుబాటులో ఉన్నాయని, కావాల్సిన రైతులు RSK వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు.రైతులకు సబ్సిడిలో స్ప్రేయర్స్ & టార్పలిన్స్ మరియు ట్రాక్టర్ అనుబంధ పరికరాలు సబ్సిడీలో కల్పించమని గ్రామ పెద్దలను అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో ఇరు గ్రామాల సర్పంచ్ లు, గ్రామ పెద్దలు, APCNF సిబ్బంది, గ్రామ వ్యవసాయ & ఉద్యాన సహాయుకులు , గ్రామ రైతులు పాల్గొన్నారు. (Story : సబ్సిడీపై ట్రాక్టర్లు.. యంత్ర పరికరాలు అందజేత)