ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కెనాన్ వర్క్ షాప్
న్యూస్‌తెలుగు/వినుకొండ : వినుకొండ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కెనాన్ వర్క్ షాప్ నిర్వహించారు. వినుకొండ బృందావన్ కళ్యాణ మండపం నందు కేశనపల్లి సుబ్బారావు అధ్యక్షతన జరిగిన కెనాన్ వర్క్ షాప్ నందు వినుకొండ నియోజకవర్గానికి చెందిన ఫోటోగ్రాఫర్లు హాజరై కెమెరాలో మెళుకువలు తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల ఫోటోగ్రాఫర్లను ఫోటోగ్రఫీలో మెలికలు నేర్పడానికి విజయవాడ మూర్తి డిజిటల్ , ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ జ్ఞానేశ్వరరావు సహకారంతో వినుకొండ నియోజకవర్గం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నిర్వహించిన వర్క్ షాప్ చాలా మంది ఫోటోగ్రాఫర్ కి వృత్తి మెళుకువలు నేర్చుకోవడానికి ఎంత దోహదపడ్డాయని, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా అవసరం అని, టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు ఫోటోగ్రాఫర్ అప్డేట్ లో ఉంటేనే ఈ రంగంలో రాణించగలుగుతారని, ఇటువంటి వర్క్ షాపు నిర్వహించిన ఫోటోగ్రాఫర్ అసోసియేషన్, అలాగే కెనాన్ కంపెనీ వారిని వినుకొండ మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లిఖార్జునరావు అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా పాల్గొన్నా ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావు మాట్లాడుతూ. వినుకొండ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ చేస్తున్న పలు కార్యక్రమాలు అభినందనీయం అని, ఆపదలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ కు అసోసియేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు కొనియాడారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ కు బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన సహకారంతో అసోసియేషన్ స్థలం ఏర్పాటు కు కృషి చేస్తాను అని తెలిపారు. ఫోటోగ్రాఫర్స్ వర్క్ షాప్ కు మెంటర్ గా వచ్చిన ప్రవీజ్ హుస్సేన్ ను అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. అలాగే రాష్ట్రస్థాయిలో 2024 సంవత్సరం లో అవార్డులు గెలుచుకున్న ఫోటోగ్రాఫర్లను వినుకొండ నియోజకవర్గం సభ్యులు ఘనంగా సన్మానించింది. అందులో అంతర్జాతీయ స్థాయిలో ఎఫ్ఐసిఎస్ తీసుకున్న గుంటూరు పట్వా అసోసియేషన్ సెక్రటరీ బి శంకర్రావు, అలాగే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీలో అవార్డు పొందిన బి.సుబ్రహ్మణ్యం ను, అలాగే అంతర్జాతీయ స్థాయిలో అవార్డు సాధించిన వినుకొండ నియోజకవర్గం అసోసియేషన్ అధ్యక్షులు కేసనపల్లి సుబ్బారావు ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ రాయల్ శ్రీకాంత్ ,గోవాడ శ్రీనివాసరావు , శ్యామ్ నాగేశ్వరరావు ,విజయ్ సాహిద్ ,అంజి ,తులసి రెడ్డి, మోహన్, సూర్య, బ్రహ్మం, గోపి, నరసింహారావు, చిన్న మల్లయ్య, ప్రసాద్, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. (Story : ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కెనాన్ వర్క్ షాప్)