గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : గ్రంథాలయానికి చదువుకోవడానికి వచ్చే పాఠకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి సందర్శించారు. ఇటీవల జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా నియామకం అయిన గోవర్ధన్ సాగర్ కలెక్టర్ కు స్వాగతం పలకగా, కలెక్టర్ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రంథాలయంలో ఉన్న సదుపాయలపై సిబ్బందితో ఆరా తీశారు. గ్రంథాలయానికి చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఇంటర్నెట్ సౌకర్యం, దిన పత్రికల సౌలభ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అసౌకర్యం కల్గకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోవర్ధన్ సాగర్, కౌన్సిలర్లు, గ్రంథాలయం సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. (Story :గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి)
