93 వ నిత్యావసర వస్తువుల వితరణ..
న్యూస్ తెలుగు / వినుకొండ : బ్రాహ్మణ సేవాసమితి వ్యవస్టాపక అధ్యక్షులు జి.వి. మాధవరావు ఆధ్వర్యములో ప్రతినెలా,ఆర్ధికముగా వెనుక బడిన బ్రాహ్మణ కుటుంబములను ఆదుకొనుట లో భాగముగా ఈ రోజు 7 కుటుంబములకు బియ్యం, నూతన వస్త్రములు బహూకరణ జరిగినది.ఈనెల దాతలు చింతలచెర్వు రాఘవేంద్ర రావు, యస్.యస్.మల్లిఖార్హున శాస్త్రి ,గోపాలుని నరసింహారావు, కుడుముల శివ రామారావు,ధూళిపాళ్ళ వెంకటేశ్వర్లు ,నందిగామ పవన్ కుమార్ గాయత్రి ,అన్నదానం సుబ్రహ్మణ్యం సహాయ సహాకారములతో బియ్యం, చీరెలు వితరణ జరిగినది.కార్యక్రమం అనంతరం గతం లో రాష్ట్రపతి అవార్డు పొంది, నేడు డాక్టరేట్ పొందిన, అందరి వాడు,కుల విశక్షణ లేకుండా సమాజ సేవయే, తన పరమావధిగా ముందుకు నడుస్తున్న డాక్టర్ పివి. సురేష్ బాబు కు ఆత్మీయ సన్మానం జరిగినది. ఈ కార్యక్రమంలో భువనగిరి సుబ్రహ్మణ్యం, అప్పరాజు నాగేశ్వరావు,అన్నా ప్రగడ వెంకటేశ్వరరావు,అనఘా సుబ్బారావు, చింతలపూడి భద్రయ్య,పాలుట్ల వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.(Story:93 వ నిత్యావసర వస్తువుల వితరణ..)