మూడోసారి బిఎస్కే చెస్ అకాడమీ ప్లేయర్గా పూజిత ఎంపిక
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : వరుసగా మూడోసారి జెఎన్టియు-అనంతపురం సౌత్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ స్థాయి పోటీలకు, ధర్మవరం బి ఎస్ కే హెచ్ ఎస్ అకాడమీ ప్లేయర్ ఏ. పూజిత ఎంపిక కావడం జరిగిందని బి ఎస్ కే చెస్ అకాడమీ చీఫ్ కోచ్ ఆది రత్న కుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం బి ఎస్ కే ప్రొఫెషనల్ చెస్ అకాడమీలో ఈ క్రీడాకారిని ఎంపిక కావడం జరిగిందని, నిజంగా గర్వించదగ్గ విషయమని వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. పూజిత ప్రస్తుతం బీటెక్ నాలుగవ సంవత్సరం ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోందని, మూడవసారి కూడా జేఎన్టీయూ అనంతపురం యూనివర్సిటీ సాయికి ఎంపిక కావడం జరిగిందన్నారు. ఈనెల 5వ తేదీన వీరికి సౌత్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీకి సంబంధించిన నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించడం జరిగిందని, ఇందులో దాదాపు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు అని, ఐదు మ్యాచ్లకు గాను నాలుగు మ్యాచ్ల్లో నెగ్గి మూడవ ప్లేస్ సాధించడం జరిగిందని తెలిపారు. ఇలా జేఎన్టీయూ అనంతపురంలో కూడా వరుసగా మూడుసార్లు ఎవరు కూడా విజేత కాలేదని తెలిపారు. జేఎన్టీయూ అనంతపురం యూనివర్సిటీకి మొత్తం ఐదుగురు ఎంపిక చేసి వారిని మళ్లీ నెలలో అనగా నవంబర్ నెలలో సౌత్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలు తమిళనాడులోని లా యూనివర్సిటీ లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందుకుగాను బీఎస్కే చీఫ్ అకాడమీ కోచ్ ఆది రత్న కుమార్, తోటి క్రీడాకారిణులు, విద్యార్థులు కలసి అభినందన శుభాకాంక్షలుతో హర్షం వ్యక్తం చేశారు (Story : మూడోసారి బిఎస్కే చెస్ అకాడమీ ప్లేయర్గా పూజిత ఎంపిక)