వనపర్తి సంస్థానదీషులు రాజావారికి విజయాదశమి శుభాకాంక్షలు
మాజీ ఎమ్మెల్యే
న్యూస్ తెలుగు /వనపర్తి : విజయదశమి సందర్భంగా వనపర్తి సంస్థానాదీషులు రాజ కృష్ణదేవరాయలు మరియు వారి కుమారుడు అరుద్రదేవ్ గారిని మాజీ పార్లమెంట్ సభ్యులు, వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి కలసి వారికి శాలువా కప్పి దసరా పండుగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా రాజు గారిని కలసి శుభాకాంక్షలు తెలియజేయడం ఆనవాయితీ అని రావుల అన్నారు. విజయదశమి సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టఐశ్వర్యాలతో ఉండాలని రావుల ఆకాంక్షించారు. రావుల చంద్రశేఖరరెడ్డి వెంట జిల్లా మిడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,కానాయ పల్లి మాజీ సర్పంచ్ పోతులపల్లి యాదయ్య సాగర్ ఉన్నారు. (Story : వనపర్తి సంస్థానదీషులు రాజావారికి విజయాదశమి శుభాకాంక్షలు)

