సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలను ఎదుర్కోవాలంటే కరాటే ఒక్కటే మార్గం
జింక పురుషోత్తం, జనార్ధన్, సీనియర్ కరాటే మాస్టర్ అక్బర్ అలీ
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలను ఎదుర్కోవాలంటే కరాటే ఒక్కటే మార్గము అని మాంగల్య సిల్క్స్ అధినేత జింకా పురుషోత్తం, ఆదిత్య స్కూల్ కరెస్పాండెంట్ జనార్దన్ కదిరి సీనియర్ కరాటే మాస్టర్ అక్బర్ అలీ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్తపేటలో గల బాలికల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మల్టీ స్టార్ బుడోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్టులు కరాటే మాస్టర్ ఇనాయత్ భాష ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే కరాటే క్రీడను నేర్చుకోవలసిన బాధ్యత ఎంతైనా ఉందని, ముఖ్యంగా బాలికలు పట్టుదలతో, అకుంఠిత దీక్షతో నేర్చుకుంటే భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని తెలిపారు. కరాటే నేర్చుకోవడం వలన శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కూడా ఉంటుందని వారు తెలియజేశారు. కరాటే నేర్చుకున్న విద్యార్థులు అందరూ కూడా సమాజంలో సేవలు అందించాలని తెలిపారు. బెల్ట్ గ్రేడ్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన వారు స్టేట్ నేషనల్ లెవెల్ లో మెడల్స్ సాధించి, మీ జీవితానికి ఉజ్వల భవిష్యత్తును ఎంచుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు చదువుతోపాటు కరాటేను కూడా నేర్పించాల్సిన బాధ్యత, ఇప్పటి కాలంలో ఎంతో అవసరం ఉందని వారు గుర్తు చేశారు. అనంతరం ముఖ్య అతిథులు చేతులు మీదుగా ఎల్లో, ఆరెంజ్ గ్రీన్, బ్లూ, పర్ఫల్ బ్రౌన్ బెల్ట్స్ తో పాటు ప్రశంసా పత్రాలను కూడా అందజేశారు. అనంతరం ముఖ్య అతిథులతో పాటు కరాటే మాస్టర్ ఇనాయత్ భాషా కూడా కరాటే క్రీడాకారులను అభినందన, శుభాకాంక్షలు తెలియజేశారు. (Story : సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలను ఎదుర్కోవాలంటే కరాటే ఒక్కటే మార్గం)