బండారు లక్ష్మన్న కుటుంబానికి మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి పరామర్శ
న్యూస్ తెలుగు /వనపర్తి : అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు వృద్ధాప్యంతో మరణించిన బండారు లక్ష్మన్న కుటుంబ సభ్యులను వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. ఆదివారం వనపర్తి నందు బసవన్న గడ్డ లో ఉన్న వారి నివాస గృహానికి చేరుకొని వారి కుమారులు బండారు వెంకటస్వామి, బండారు శ్రీనివాసులు, బండారు గోపాల్, బండారు రాజా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి సంతాపం తెలిపారు. కుటుంబ పెద్ద , కన్న తండ్రినీ కోల్పోతే ఆ కుటుంబానికి తీరని లోటు అన్నారు. వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. ఆయన వెంట వనపర్తి జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, అధికార ప్రతినిధి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ,మాజీ మార్కెట్ చైర్మన్ ,వనపర్తి పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు పి రమేష్ గౌడ్, మీడియా ప్రతినిధి నంది మల్ల అశోక్, పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి, రమేష్ చంద్ర, ఎండి గౌస్ పాల్గొన్నారు.(Story:బండారు లక్ష్మన్న కుటుంబానికి మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి పరామర్శ)
