క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయి : సి ఐ శ్రీనివాస్
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో :(వై. లకుమయ్య ) : క్రీడాలు మానసిక ఉల్లాసానికి దోహద పడుతాయని,పోలీస్ శాఖ ఏటూరునాగారం సి ఐ అనుముల శ్రీనివాస్ అన్నారు. శనివారం
హోప్ స్వచ్ఛంద సంస్థ మంగపేట వారి ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న ములుగు జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ఏటూరు నాగారం సి ఐ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి అని, క్రీడల తో స్నేహ సంబంధాలు పెంచుకోవచ్చని తెలిపారు. హోప్ స్వచ్ఛంద సంస్థ వారు నిర్వహిస్తున్న ఈ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం గా పూర్తి అవడానికి క్రీడాకారులు సహకరించాలని కోరారు.
హోప్ స్వచ్ఛంద సంస్థ వారు ప్రజల కి ఉపయోగ పడే మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హోప్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సయ్యద్ ఖలీద్, ఏటూరు నాగారం, మంగపేట యస్ ఐ లు తాజుద్దీన్, టి వి ఆర్ సూరి , జిల్లా మైనారిటీ అధ్యక్షులు అయ్యుబ్ ,మండల అధ్యక్షులు చిట్టమట రఘు జిల్లా కో ఆప్షన్ మెంబెర్ వాలియాబీ సలీం ,హోప్ ప్రధాన కార్యదర్శి ఫయాజ్ ,ఉపాధ్యక్షులు మినహాజ్ ,హోప్ సభ్యులు ప్రశాంత్ ,రవితేజ ,రియాజ్ ,అన్వార్ ,షారు ,ఇర్ఫాన్ ,తరుణ్ ,షహీద్ సుమన్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. (Story : క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయి : సి ఐ శ్రీనివాస్)